నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో వున్నాడు.. అలాగే బాలయ్యహీరోగానే కాకుండా హోస్ట్ గా కూడా అదరగొడుతున్నాడు.. బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.. ఇప్పటికే మూడు సీజన్ లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ టాక్ షో తాజాగా 4 వ సీజన్ తో అదరగొడుతుంది.. ఇప్పటికే ఈ సీజన్ లో సూర్య, దుల్కర్, అల్లుఅర్జున్ వంటి స్టార్స్ సందడి చేయగా తాజాగా తొమ్మిదో ఎపిసోడ్‌కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అతిథిగా వచ్చారు.
బాలయ్య, ఎన్టీఆర్ ఇష్యూ పై క్లారిటీ ఇచ్చిన నాగావంశీ..!!
ఈ షో లో బాలయ్య తో ఎంతో సరదాగా సందడి చేసిన చరణ్ ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాడు . ఈ క్రమంలో పవన్ కల్యాణ్ తనయుడు అకిరా నందన్ గురించి కూడా చరణ్ మాట్లాడారు. గేమ్ ఛేంజర్ మూవీలో అకిరా ఉంటాడని సరదాగా అందరిని ఆటపట్టించారు.కాగా.. ఈ షోలో అకిరా గురించి రామ్‌చరణ్ ఏం చెప్పారు. అకిరా సినీ ఎంట్రీ పై ఏమైనా మాట్లాడారా.. ఇంకా ఎలాంటి విషయాలు చెప్పుకొచ్చాడో తెలియాలంటే ఈ మెగా పవర్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ షో ఆహా వేదికగా జనవరి 8 (బుధవారం ) రాత్రి 7 గంటలకు స్ట్రీమింగ్ కానుంది.
ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో కూడా విడుదలైంది. చరణ్ తో పాటు శర్వానంద్, నిర్మాత దిల్ రాజులు ఈ షోలో పాల్గొన్నారు.శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్. బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చరణ్ బాలయ్య షో కి వచ్చారు