MOVIE NEWS

అన్ ప్రిడిక్టబుల్ సాంగ్ వచ్చేసింది.. సినిమాలో ఇంకెన్ని సర్ప్రైజ్ లు ఉన్నాయో..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్”.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ జనవరి 10న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా లో రాంచరణ్ డ్యూయల్ రోల్ లో నటించాడు..తండ్రి కొడుకులుగా రాంచరణ్ నట విశ్వరూపం చూపించాడు..ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న రాంచరణ్ ఇప్పుడు గేమ్ ఛేంజర్ తో మరో సాలిడ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ అలాగే ఆరు పాటలు సైతం ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకున్నాయి.. ఇదిలా ఉంటే ఈ సినిమా నుండి తాజాగా మరో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.

గేమ్ ఛేంజర్ : చరణ్ యాక్టింగ్ కి స్టన్ అయిపోయిన శంకర్.. మేకింగ్ వీడియో వైరల్..!!

సినిమాలో బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే అన్‌ప్రెడిక్టబుల్.. సాంగ్ ని తాజాగా రిలీజ్ చేసారు.ఈ సాంగ్ చాలా స్టైలిష్ గా ఉంది. సినిమాలో హీరో ఎలివేషన్స్ బ్యాక్ గ్రౌండ్ లో ఈ సాంగ్ వాడతారని సమాచారం. ఈ పాటను అద్వితీయ, బ్లేజ్ రాయగా తమన్ సంగీత దర్శకత్వంలో తమన్, బ్లేజ్ పాడారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అవుతుంది..గేమ్ ఛేంజర్ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు..

ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ అలాగే క్యూట్ బ్యూటీ అంజలీ హీరోయిన్స్ గా నటించారు.. అలాగే శ్రీకాంత్, SJ సూర్య, నవీన్ చంద్ర, సునీల్ వంటి పలువురు స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు..ఈ సినిమాలో చరణ్ మూడు డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నాడు. సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పై మూవీ టీం బాగా హైప్ పెంచుతున్నారు.

Related posts

వార్ 2 : ఎన్టీఆర్ క్యారెక్టర్ లో ఊహించని ట్విస్ట్.. ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ గ్యారెంటీ..!!

murali

మహేష్ కు రాజమౌళి సరికొత్త కండిషన్స్.. బాబు పాటిస్తాడా..?

murali

సంధ్య థియేటర్ ఘటన..గేమ్ ఛేంజర్ విషయంలో అలెర్ట్ అయిన దిల్ రాజు..!!

murali

Leave a Comment