పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి. ఏడాదికి రెండు సినిమాలు చేసుకుంటూ ప్రభాస్ దూసుకుపోతున్నాడు.గతంలో వచ్చిన కల్కి’, ‘సలార్’ సినిమాలతో ప్రభాస్ తన కెరీర్ మరో రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు..ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ తో ‘రాజా సాబ్’అనే బిగ్గెస్ట్ హారర్ కామెడీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి 90 శాతం కి పైగా టాకీ పార్ట్ పూర్తి అయింది.ఏప్రిల్ 10 న గ్రాండ్ గా విడుదల చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేసారు.. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఆలస్యం అవుతుండడంతో సినిమా వాయిదా పడినట్లు తెలుస్తుంది.. ఈ ఏడాది చివర్లో ”రాజాసాబ్” విడుదలయ్యే అవకాశం ఉంది.
ఎన్టీఆర్,నెల్సన్ మూవీకి క్రేజీ టైటిల్ ఫిక్స్..?
ఈ చిత్రంతో పాటు ప్రభాస్ హను రాఘవపూడి తో ‘ఫౌజీ’..సందీప్ రెడ్డి వంగ తో స్పిరిట్ అనే భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే… ఇదిలా ఉంటే ఈ గ్యాప్ లో ప్రభాస్ ప్రశాంత్ వర్మ తో కూడా ఒక సినిమాని రీసెంట్ గానే ఒప్పుకున్నట్లు సమాచారం.ఈ చిత్రానికి సంబంధించి ప్రభాస్ లుక్ టెస్ట్స్ లో కూడా పాల్గొన్నాడు. ఆయనతో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే కూడా లుక్ టెస్ట్ లో పాల్గొనింది… తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి ‘బక’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఇదేమి విచిత్రమైన టైటిల్ రా నాయనా అంటూ సోషల్ మీడియా లో ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ‘బక’అంటే ‘బకాసురుడు’ అని అర్థం..పురాణాల్లో బకాసురుడు గ్రామాల్లోకి చొరబడి బండెడు అన్నం, రెండు దున్నలు, ఒక మనిషిని ఆహారంగా తీసుకునేవాడు. ఈ బకాసురుడు క్యారక్టర్ ని ప్రభాస్ చేయబోతున్నాడని సమాచారం..అయితే ప్రభాస్ తో చేసే ఈ బకాసురుడి పూర్తి చరిత్ర గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ సరికొత్త కోణంలో చూపించనున్నట్లు సమాచారం..