గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన “గేమ్ ఛేంజర్” విడుదలకు సిద్ధం అయింది.. జనవరి 10 న సంక్రాంతి కానుకగా ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది..స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించాడు.. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందించాడు.. గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటికే నాలుగు పాటలు రిలీజ్ అయ్యాయి.. ఆ నాలుగు పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి.. అయితే పాటల విషయంలో అభిమానులు హ్యాపీనే కానీ ఇంకేదో మిస్సయ్యిందనే ఫీలింగ్ వాళ్లలో కొంత ఉంది.
సినిమా కంటెంట్ కి అంతా స్టన్ అయిపోతారు.. శంకర్ షాకింగ్ కామెంట్స్..!!
సాంగ్స్ విపరీతంగా వైరల్ కాకపోవడం పక్కనపెడితే విజువల్ గా శంకర్ చూపించిన గ్రాండియర్, రామ్ చరణ్ స్టెప్పులు వాటిలో కొన్ని బలహీనతలు కనిపించాయి.తమన్ పనితనం మీద అనుమానం లేదులే కానీ ఈ సంక్రాంతికి పోటీలో ఉన్న సంక్రాంతికి వస్తున్నాం ఆల్బమ్ దూసుకుపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహంగా వున్నారు. గోదారి గట్టు సాంగ్ అయితే మాములుగా వైరల్ కాలేదు. రీల్స్ లో సైతం హోరెత్తిస్తుంది… అయితే అసలు తమన్ సత్తా మాత్రం వేలాది ఫ్యాన్స్ సమక్షంలో నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బయటపడింది.
ఇప్పటిదాకా విడుదల కాని రెండు పాటలు, ఒక ర్యాప్ సాంగ్ నిన్న వేదిక మీద లైవ్ పెర్ఫార్మన్స్ ద్వారా మేకర్స్ లాంచ్ చేశారు.ఈ రెండు పాటలు దేనికదే క్రేజీగా ఉండటంతో వీలైనంత త్వరగా లిరికల్ వీడియోలు వదలమని ఫ్యాన్స్ మేకర్స్ ని డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండు సాంగ్స్ ఆడియో రూపంలో కొన్ని మ్యూజిక్ ప్లాట్ ఫార్మ్స్ ద్వారా రాత్రి నుంచే అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా కొండ దేవర అనే సాంగ్ కు తమన్ ఇచ్చిన బీట్స్, గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి..తప్పెట గూళ్ళు వాయించుకునే సంప్రదాయ నృత్యకారుల శైలికి అనుగుణంగా చేసిన కంపోజింగ్ సినిమాకు ఓ రేంజ్ లో హై ఇచ్చేలా సాగింది. ఈ సాంగ్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ముఖ్యమైన సాంగ్ అని తెలుస్తుంది..