MOVIE NEWS

గేమ్ ఛేంజర్ తో ప్రేక్షకులకు టార్చర్ తప్పదు.. బాలీవుడ్ క్రిటిక్ షాకింగ్ కామెంట్స్..!!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ గా విడుదల కానుంది.ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, అంజలి, సముద్రఖని, ఎస్‌జె సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘గేమ్ ఛేంజర్’ అత్యంత భారీ బడ్జెట్‌తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి..ట్రైలర్‌ను గమనిస్తే సినిమాలో దర్శకుడు శంకర్ మార్క్ కనిపిస్తోంది.

రిలీజ్ సమయంలో అక్కడ ‘గేమ్ ఛేంజర్ ” కు బిగ్ షాక్..!!

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు.శంకర్ గత సినిమాల మాదిరిగానే అన్యాయాలపై పోరాడే హీరోగా రామ్ చరణ్ కనిపించబోతున్నట్లు తెలుస్తుంది… ఇదిలా ఉంటే ఈ సినిమాపై బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సంధు తన ఫస్ట్ రివ్యూని ఇచ్చారు. ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ నుండి మొదటి రివ్యూ పేరిట ఉమర్ సంధు తన రివ్యూ ఇచ్చాడు.సినిమా అస్సలు బాలేదని ఉమర్ సంధు చెప్పేసాడు..శంకర్ , రామ్ చరణ్‌ కాంబినేషన్ లో వచ్చిన అత్యంత వరస్ట్ సినిమాగా ‘గేమ్ ఛేంజర్’ ఉందని ఉమర్ సంధు చెప్పుకొచ్చాడు.బోరింగ్ నేరేషన్, పాత కథ, స్క్రీన్ ప్లే & డైలాగ్స్ కూడా అస్సలు బాగోలేవని ఈ బాలీవుడ్ క్రిటిక్ తెలిపాడు.

నటీనటుల ప్రదర్శన కూడా అంతఅంత మాత్రంగానే ఉందని తెలిపాడు. ఈ విషయంలో రామ్ చరణ్ అలాగే ఆయన ఫ్యాన్స్ నన్ను క్షమించాలని అతను కోరాడు. ఫైనల్‌గా ఈ సినిమా ఫ్యాన్స్ కి సైతం టార్చర్ అని ఉమర్ తేల్చేశాడు. ఉమర్ సంధు ట్వీట్‌పై మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి ట్వీట్స్ చేయడానికి అసలు సిగ్గుందా అని కొందరు కామెంట్స్ చేస్తుంటే అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.

Related posts

గేమ్ ఛేంజర్ : రాంచరణ్ పాత్రలో సూపర్ ట్విస్ట్.. శంకర్ గట్టిగానే ప్లాన్ చేసాడుగా..!!

murali

సూపర్ స్టార్ ధనుష్ #D52 మూవీ టైటిల్ ‘ఇడ్లీ కడై’

filmybowl

మరో క్రేజీ సాంగ్ తో వస్తున్న పుష్ప రాజ్.. ప్రోమో అదిరిందిగా.. ఫుల్ సాంగ్ ఎప్పుడంటే..?

murali

Leave a Comment