Tollywood Mega Season : ఇదేంటీ కొత్తగా మెగా సీజన్ అనుకుంటున్నారా. ఇండస్ట్రీ లో బడా సినిమాలకి ఎప్పుడు కొదవ లేదు పైగా ఈ మధ్య బాహుబలి పుణ్యమా అని అన్నీ ఇండస్ట్రీస్ కలిసిపోయాయి. ఏ ఇండస్ట్రీ లో పెద్ద సినిమా వచ్చినా అందరు చూసేస్తున్నారు. సో కొత్తగా మళ్ళీ మెగా సీజన్ ఎంటా అనుకుంటున్నారా…. సరే చదవండి ఐతే.
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ముఖ్యంగా కుటుంబాల హవా ఎప్పుడు నడుస్తూనే వుంటది. దాంట్లో మెగా కుటుంబ హవా కూడా కనిపిస్తూనే వుంటది. ఆ కుటుంబం నుంచి చిన్నా, పెద్దా అందరినీ కలుపుకొని డజన్ మంది తారలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరి నుంచి లైన్ గా సినిమాలు రానున్నాయి. అవేంటో లుక్కేద్దాం
నవంబర్ 14న మెగా ప్రిన్స్ వరుణ తేజ్ మొదటి కొబ్బరి కాయ కొట్టనున్నాడు. తాను నటించిన మట్కా చిత్రం భారీ అంచనాల నడుమ రిలీజ్ అవుతుంది. వరుణ్ కెరీర్ లో ఇది రెండవ పాన్ ఇండియా రిలీజ్ ఇది. వరుస ఫ్లాప్ లో ఉన్నా కూడా కథ మీద నమ్మకం తో నిర్మాతలు భారీ బడ్జెట్ తో నిర్మించారు. మట్కా అనే క్రీడ నీ బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని పాన్ ఇండియాకి కనెక్ట్ చేస్తున్నారు చిత్ర బృందం.
ఈ సినిమా తొ ప్రేక్షకుల్ని ఓ కొత్త వరల్డ్ లోకే మెగా ప్రిన్స్ తీసుకెళ్లనున్నాడని అభిమానులంతా ఎంతో ఆశగా ఉన్నారు. కొంతకాలంగా వరుణ్ కి సరైన సక్సెస్ పడలేదు. దీంతో ఈ సినిమాపై వరుణ్ తో మెగా ఫ్యామిలీ కూడా చాలా ఆశలు పెట్టుకున్నాయి.
Read Also : ప్రభాస్ లుక్ పై మరోసారి పెదవి విరుస్తున్న నెట్టిజన్లు…
ఇక ఈ సినిమా తర్వాత రాబోతున్న మరో సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్. చాల సంవత్సరాల నుంచి షూటింగ్ జరుపుకుంటూ వాయిదాల మీద వాయిదాలు పడుతూ మొత్తానికి సంక్రాంతి పండగ బరిలో నిలిపారు దర్శక నిర్మాతలు.
గేమ్ ఛేంజర్ అనే సినిమా జనవరి 10న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ అవ్వాలి.కానీ అదే టైం లైన్ లో పుష్ప-2 వుండడం ఆ సినిమా కూడా పాన్ ఇండియా రిలీజ్ కి రెడీ అవ్వడం తొ గేమ్ ఛేంజర్ నీ జనవరికి పుష్ చేసారు. దాని కోసమే చిరంజీవి విశ్వంభర సినిమా నీ వాయిదా వేశారు.
ఈ సినిమానే తొలుత పండక్కి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ చరణ్ సినిమా నీ సంక్రాంతి బరిలో నిలపడం కోసం విశ్వంభర నీ వాయిదా వేసుకున్నట్లు దర్శకుడు వశిష్ఠ ప్రకటించాడు. అందుకని `విశ్వంభర టార్గెట్ సమ్మర్ అయింది.
మట్కా, గేమ్ ఛేంజర్, విశ్వంభర తర్వాత మెగా కుటుంబం నుంచి రాబోతున్న మరో హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
Read Also : ఇట్స్ మీనాక్షి టైం
పవర్ స్టార్ నుంచి ఈ సారి ఓజీ, హరి హర వీరమల్లు సినిమాలు రేసులో ఉన్నాయి. హరి హర వీర మల్లు కి ఆల్రెడీ రిలీజ్ డేట్ ప్రకటించారు ఆ సినిమా దర్శక నిర్మాతలు. మార్చ్ 28 కి వస్తాం అని చెప్పారు దానికి తగ్గట్టు గానే పవన్ ఆ రెండు సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ బాగా ఆలస్యమవ్వడంతో ఇక డిలే లేదంటూ సెట్స్ కి హాజరవుతున్నారు.
ఆ లెక్కన నవంబర్ నుంచి వచ్చే ఏడాది మిడ్ వరకూ మార్కెట్ లో మెగా సీజన్ కనిపిస్తుంది. వీటిల్లో ఎన్ని సినిమాలు ప్రేక్షకులని అలరిస్తాయి చూడాలి.
Follow us on Instagram