రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాపై ప్రేక్షకులలో విపరీతమైన హైప్ ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమా క్యూరియాసిటీ మరింత పెరిగేలా చేసాయి.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ విభిన్న గెటప్‍ల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.”VD12” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. తాజాగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేసేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు..ఈ మూవీ టైటిల్ టీజర్ రేపు (ఫిబ్రవరి 12) గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.. విజయ్ “VD12”కోసం ముగ్గురు వేర్వేరు ఇండస్ట్రీ ల స్టార్ హీరోలు రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తుంది.”VD12” టైటిల్ టీజర్ హిందీ వెర్షన్‍కు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు మూవీ టీమ్ నేడు అధికారికంగా వెల్లడించింది. తెలుగు వెర్షన్‍కు టాలీవుడ్ స్టార్ హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.అలాగే తమిళ వెర్షన్‍లో స్టార్ హీరో సూర్య వాయిస్ ఇచ్చారు..
పాప్ సింగర్ నోట.. చుట్టమల్లే పాట.. ఏం క్రేజ్ మావ..!!
గత కొంత కాలంగా ’VD12’ కోసం రణ్‍బీర్, జూనియర్ ఎన్టీఆర్, సూర్య వాయిస్ ఇవ్వనున్నట్లు న్యూస్ బాగా వైరల్ అయింది..అయితే, మూవీ యూనిట్ అధికారికంగా కన్ఫర్మ్ చేసేసింది. టైగర్ సింబల్‍ను నిర్మాత నాగవంశీ పోస్ట్ చేయటంతో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఉండనుందని కన్ఫర్మ్ అయింది. సూర్య డబ్బింగ్‍కు వచ్చిన ఫొటోను సోమవారం మూవీ టీమ్ పోస్ట్ చేసింది. హిందీ టీజర్లో రణ్‍బీర్ కపూర్ వాయిస్ ఉంటుందని చిత్ర యూనిట్ నేడు అధికారింగా వెల్లడించింది.
టైటిల్ టీజర్ అనౌన్స్మెంట్ పోస్టర్ సైతం మేకర్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసారు. ఈ పోస్టర్లో ఓ కిరీటం ఉంది. రాజు కోసం కిరీటీం వేచిచూస్తోందని అందులో ఉంది. టైటిల్‍పై ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తి ఉంది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍గా నటిస్తుంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీని మేకర్స్ మే 30న రిలీజ్ చేయాలనే ఆలోచనలో వున్నారు..