గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ గేమ్ ఛేంజర్ “.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గేమ్స్ చేంజర్ సినిమా మీద ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.
ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు..
విశ్వంభర : కీలక నిర్ణయం తీసుకున్న మేకర్స్..ఫ్యాన్స్ ఒత్తిడే కారణమా..?
ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.. క్యూట్ బ్యూటీ అంజలీ ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటించింది. సునీల్, నవీన్ చంద్ర, ఎస్. జె సూర్య, సముద్రఖనీ వంటి స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు..స్టార్ డైరెక్టర్ శంకర్ ఎంటైర్ కెరియర్ లో ఇప్పటివరకు స్ట్రైయిట్ తెలుగు సినిమా ఒక్కటి కూడా చేయలేదు. ఇక దాంతో గేమ్ చేంజర్ సినిమానే తను చేస్తున్న మొదటి తెలుగు సినిమాగా మారనుంది.. కాబట్టి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకోవాలని ఆయన కూడా తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు.
రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాఫై సూపర్ హైప్ ని తీసుకొచ్చింది… ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇద్దరు స్టార్ డైరెక్టర్లు నటించబోతున్నారనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఆ డైరెక్టర్లు ఎవరు అంటే ఒకరు రాజమౌళి కాగా మరొకరు సంచలన డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగ అని తెలుస్తోంది. వీళ్ళిద్దరూ సినిమాలో రెండు వేరు వేరు సీన్లలో కనిపిస్తారని సమాచారం.సినిమాపై మరింత హైప్ పెంచేందుకు శంకర్ ఆ రెండు క్యారెక్టర్స్ డిజైన్ చేసినట్లు సమాచారం..