MOVIE NEWS

అసలైన ఫ్యానిజం అంటే ఇదే.. సందీప్ వంగా పోస్ట్ వైరల్..!!

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన చిరంజీవి హీరోగా, విలన్ గా నటించి తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్నారు.. తన అద్భుతమైన యాక్టింగ్ తో చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగారు..మిగిలిన హీరోల కంటే చిరంజీవికి ప్రత్యేకంగా గుర్తింపు రావడానికి కారణం ఆయన డాన్స్ మూమెంట్స్.. అప్పట్లో చిరంజీవి వేసే స్టెప్స్ చూసేందుకు ఫ్యాన్స్ థియేటర్ బయట గంటలు గంటలు ఎదురుచూసేవారు.. చిరంజీవి మూవీ వచ్చిందంటే ఆ ఆరోజు ఫ్యాన్స్ కి పండగే.. ముఖ్యంగా మహిళా అభిమానులు చిరంజీవి సినిమా కోసం ఎంతో ఎదురుచూసేవారు..ఇండస్ట్రీలో ఇప్పుడున్న యంగ్ హీరోలు, యంగ్ డైరెక్టర్స్‌లలో చాలా మంది మెగాస్టార్ కల్ట్ ఫ్యాన్స్ అని చెప్పొచ్చు.. ఎందరో యంగ్ డైరెక్టర్స్, యాక్టర్స్ కి చిరంజీవి మంచి ఫ్లాట్ ఫామ్ చూపించారు.. టాలెంట్ వున్న ప్రతీ వ్యక్తిని చిరంజీవి ఎంతగానో ప్రోత్సహిస్తారు.. అందుకే ఇండస్ట్రీకి రావాలనుకునే ప్రతీ వ్యక్తీ మెగాస్టార్ ని చూసి ఇన్స్పైర్ అవుతుంటారు..

SSMB : రాజమౌళి టీం కు వార్నింగ్ ఇచ్చిన కెన్యా గవర్నమెంట్.. కారణం అదేనా..?

అలా ఇన్స్పైర్ అయిన దర్శకులలో సందీప్ రెడ్డి కూడా ఒకరు. సందీప్‌ను డై హార్డ్ మెగాభిమానిగా మాత్రమే చూడలేం. ఎందుకంటే.. మెగా కల్ట్‌ ఫ్యాన్స్ కి అంతకు మించి అప్డేటెడ్ వెర్షన్ అని చెప్పొచ్చు…తాజాగా సందీప్ షేర్ చేసిన ఫోటోనే అందుకు నిదర్శనం..సందీప్ గతంలో చాలా సందర్భాల్లో తాను మెగాస్టార్ డై హార్డ్ ఫ్యాన్ అని చెప్పుకొచ్చాడు. కానీ తన భద్రకాళి సినిమా ఆఫీస్‌లో మెగాస్టార్ ఫోటో చూస్తే మాత్రం మెగాభిమానుల అభిమానం కంటే సందీప్ ఫ్యానిజం పీక్స్ లో ఉందని తెలుస్తుంది..గత రెండు రోజుల క్రితం సందీప్ రెడ్డి వంగ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశాడు. అందులో మెగాస్టార్ చిరంజీవి మాస్ ఫ్రేమ్ ఒకటి నెక్స్ట్ లెవల్లో ఉంది.

సందీప్ వంగా తన అభిమాన హీరో చిరు నటించిన ఆరాధన సినిమా నుంచి ఒక సీన్‌లోని ఫ్రేమ్‌ను కట్ చేసి ఫ్రేమ్ చేయించుకోని మరి తన ఆఫీస్‌లో పెట్టుకున్నాడు. ఆ పిక్ చూసాక సందీప్‌కు మెగాస్టార్ అంటే ఎంత అభిమానమో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఒక్క ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇది చూసాక చిరు-సందీప్ కాంబినేషన్ లో ఊర మాస్ మూవీ పడితే బాగుంటుందని మెగాఫ్యాన్స్ భావిస్తున్నారు… ఇప్పటికే పలు సందర్భాల్లో మెగాస్టార్‌తో ఖచ్చితంగా సినిమా చేస్తానని సందీప్ చెప్పుకొచ్చాడు. కాబట్టి సందీప్ నుంచి మరో ఊర మాస్ మూవీ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు..

Related posts

అల్లు vs మెగా : పుష్ప 2 బెన్ఫిట్ షోస్ పై సరికొత్త పంచాయితీ..!!

murali

రాంచరణ్ : ఆ విషయంలో అలా ఎందుకు జరుగుతుందో ఇప్పటికీ అర్ధం కావట్లేదు..!!

murali

పుష్ప 2 : వాయిదా విషయంపై ఎవరి వాదన వారిది.. మరి సుకుమార్ ఏం చేస్తాడో..?

murali

Leave a Comment