MOVIE NEWS

అవకాశాలు పేరుతో నన్ను వాడుకుందాం అని చూసారు.. అనసూయ షాకింగ్ కామెంట్స్..!!

ప్రతీ రంగంలో మహిళలు వేదింపులకు గురవుతున్నారు.. సమాజంలో మహిళలకు సమాన హక్కులు ఇస్తాం అంటూనే వారిని ఇంకా అనగదొక్కుతున్నారు.. ఇంటిని వదిలి ఒక మహిళ ఉద్యోగానికి వెళ్లి రావడం చాలా పెద్ద విషయంగా మారింది ఎందుకంటే ప్రస్తుతం రోజులు అంతగా ఏమి బాగోలేదు.. ఎప్పుడు ఎలాంటి ఘోరాలు జరుగుతాయో తెలియని పరిస్థితి.. మహిళలు ప్రతీ రంగంలో వేదింపులకు గురవుతున్నారు.. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపుల బాధ తప్పడం లేదు. పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది మహిళలు బహిరంగంగానే వెల్లడిస్తున్నారు… తమకు ఎదురైన లైంగిక వేధింపులు, కమింట్మెంట్‌ల గురించి నేటి తరం హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎలాంటి భయం లేకుండా బహిరంగంగానే వెల్లడిస్తున్నారు.

ప్రభాస్ మూవీలో సాయి పల్లవి..? ఫిక్స్ అయితే ఫ్యాన్స్ కి పండగే..!!

తాజాగా స్టార్ యాంకర్, నటి అనసూయ సైతం తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి వెల్లడించింది. నిఖిల్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో అనసూయ పలు అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు… ఈ సందర్భంగా తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి అనసూయ చెప్పుకొచ్చారు… సినిమాల్లో అవకాశాల పేరుతో తనని వాడుకునేందకు హీరోలు, దర్శకనిర్మాతలు ప్రయత్నించారని అనసూయ సంచలన కామెంట్స్ చేశారు.ఓ స్టార్ హీరో తనని ఇలాగే కమింట్మెంట్‌ అడిగారని ఆయనకు తాను నో చెప్పినట్లు అనసూయ తెలిపింది..

అలాగే ఓ స్టార్ దర్శకుడు సైతం తనకి అవకాశం ఇస్తానని చెప్పి కమిట్మెంట్ అడగడంతో రిజెక్ట్ చేశానని అనసూయ తెలిపింది. దీంతో తనకి సినిమా అవకాశాలు తగ్గాయని ఆమె తెలిపింది..ఇండస్ట్రీలో మహిళలకు వేదింపులు ఇంకా జరుగుతూనే  ఉన్నాయని అనసూయ చెప్పుకొచ్చింది..ఇండస్ట్రీకి వచ్చే మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని.. ఎవరి మాయ మాటలకూ లొంగవద్దని ఆమె హెచ్చరించింది..

 

 

Related posts

శంకర్ నెక్స్ట్ సినిమా ఎవరితోనో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

murali

NTR-NEEL: వికారాబాద్ అడవుల్లో షూటింగ్..లొకేషన్స్ వేటలో ప్రశాంత్ నీల్..!!

murali

ఇట్స్ మీనాక్షి టైం

filmybowl

Leave a Comment