MOVIE NEWS

వారి వల్లే మా సినిమాకు నెగటివిటీ.. మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు.. ప్రెస్టేజియస్ మూవీగా తెర కెక్కుతున్న ‘కన్నప్ప’ మూవీలో విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘కన్నప్ప’ మూవీ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది.. కలెక్షన్స్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు… భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది.. మహా భారతం సీరియల్ ఫేమ్ ముకేశ్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.. అయితే మంచు విష్ణుకి పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ లేకపోవడంతో ఈ సినిమాకు ప్లస్ అయ్యే విధంగా పాన్ ఇండియా లెవల్ లో భారీ స్థాయిలో ప్రమోట్ చేసేందుకు ఇండియా వైడ్ పాపులర్ అయిన బిగ్ స్టార్స్ ని ఈ సినిమాలో కీలక పాత్ర చేసేలా ఒప్పించారు..

వార్ 2 : రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!!

ఈ సినిమాలో మోహన్ బాబు శరత్ కుమార్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ వంటి స్టార్స్ కీలక పాత్ర పోషించారు.. అలాగే ఈ సినిమాకు మెయిన్ అసెర్ట్ అయిన ప్రభాస్ “ రుద్ర” అనే పాత్రలో నటించాడు..ప్రభాస్ నటించిన రుద్ర అనే పాత్ర సినిమాకు ప్లస్ అవుతుందని మూవీ టీం చాలా నమ్మకంగా వుంది..రుద్ర పాత్ర దాదాపు 25-30 నిమిషాలు ఉంటుందని సమాచారం.. కన్నప్ప సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 25 న మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..

దీనితో మంచు విష్ణు ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.సినిమా నుండి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ పై ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.. శివ శివ శంకర సాంగ్ అయితే ఫుల్ పాపులర్ అయింది..ఈ సినిమాకి స్టీఫెన్‌ దేవస్సే, మణిశర్మ సంగీతం అందించారు..అయితే ఈ సినిమా విజువల్స్ పరంగా నెటిజన్స్ నుంచి ప్రారంభం లో దారుణమైన ట్రోల్స్ వచ్చాయి.. ట్రోల్స్ గురించి తాజాగా మంచు విష్ణుని ప్రశ్నించగా షాకింగ్ కామెంట్స్ చేసారు..మా సినిమాకు తమిళ్, కన్నడ, మలయాళం లో ఎలాంటి నెగటివిటీ లేదు.. అలాగే హిందీలో కేవలం 1 పెర్సంట్ నెగటివిటీ ఉందని, కానీ తెలుగు లో 15 – 20 పెర్సెంట్ నెగటివిటీ ఉందని తెలిపారు..మన తెలుగు ప్రేక్షకులు సినిమా పరంగా ప్రతీ చిన్న విషయాన్నీ సుధీర్ఘంగా పరిశీలించడంతో ప్రపంచ వ్యాప్తంగా మా సినిమాపై నెగటివిటీ స్ప్రెడ్ అవుతుందని విష్ణు తెలిపారు..

Related posts

హరిహర వీరమల్లు : పవన్ సినిమా ప్రచార భారమంతా ఆ హీరోయిన్ పైనే..?

murali

ఆ క్లాస్ డైరెక్టర్ తో మూవీకి సిద్ధమవుతున్న రవితేజ..!!

murali

మెగాస్టార్ ” విశ్వంభర ” సమ్మర్ కైనా వచ్చేనా..?

murali

Leave a Comment