MOVIE NEWS

ఈ మూడు రోజులు అస్సలు సంతోషమే లేదు..మమ్మల్ని క్షమించండి.. సుకుమార్ ఎమోషనల్ కామెంట్స్..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతుంది.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో అల్లుఅర్జున్ నట విశ్వరూపం చూపించారు.. సినిమా మొదలు నుంచి అఖరు వరకు అల్లుఅర్జున్ రప్పా రప్పా పెర్ఫార్మన్స్ అదిరిపోతుంది..ఈ సినిమాకు మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.

పుష్ప 2 : కల్యాణ్ బాబాయ్ థాంక్యు..అల్లు అర్జున్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!!

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజు ఏకంగా రూ. 294 కోట్ల కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది.. ఓవరాల్ గా రెండు రోజుల్లో పుష్ప 2 సినిమా ఏకంగా రూ. 449 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. దీనితో మేకర్స్ ఈ సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు.. బంజారా హిల్స్ రాడిసన్ బ్లూ హోటల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హీరో అల్లు అర్జున్,డైరెక్టర్ సుకుమార్ తో పాటు చిత్ర నిర్మాతలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సుకుమార్ సంధ్య థియేటర్ ఘటన తల్చుకుని కాస్త ఎమోషనల్ అయ్యారు.

‘నేను మూడు రోజుల నుంచి అస్సలు సంతోషంగా లేను. నేను ఓ సినిమా మూడేళ్లు తీసినా, ఆరేళ్లు తీసినా ఒక ప్రాణాన్ని మాత్రం కాపాడుకోలేకపోయాం. రేవతి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఆ బాధ నుంచి కాస్త తేరుకున్నాకే రికార్డులు చూస్తున్నాం అని సుకుమార్ తెలిపారు.. ఆ కుటుంబానికి ఎప్పుడు తోడుగా ఉంటాం’ అని సుకుమార్ భరోసా ఇచ్చారు.‘పుష్ప 2 డైరెక్టెడ్ బై సుకుమార్ మాత్రమే కాదు.. శ్రీమాన్ అని కూడా వేయాలి.. ఈ సినిమాలో సగం ఆయనే డైరెక్ట్ చేశాడు.. సెకండ్ యూనిట్ మొత్తం శ్రీమానే చూసుకున్నాడు. సుకుమార్ అనేవాడు ఒక్కడు కాదు.. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం కలిస్తేనే సుకుమార్ అవుతాడు’ తన టీమ్ గురించి సుకుమార్ ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు

Related posts

అందరూ కలిసి బన్నీని ఒంటరి చేసారు.. సంధ్య థియేటర్ ఘటనపై పవన్ షాకింగ్ కామెంట్స్..!!

murali

బాలయ్య “డాకు మహారాజ్ ” ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..?

murali

OG పెద్ద రేంజ్ హిట్ అవుతుంది – ఎస్ ఎస్ థమన్

filmybowl

Leave a Comment