MOVIE NEWS

టికెట్ రేట్స్ హైక్ లేదు.. బెన్ఫిట్ షో పడేది లేదు..మరి “గేమ్ ఛేంజర్” పరిస్థితి ఏంటి..?

టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయంటే చాలు ఫ్యాన్స్ హడావుడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ స్టార్ హీరోల సినిమాలకు టికెట్స్ రేట్స్ పెంచుకునేందుకు స్పెషల్ పర్మిషన్ ఇవ్వడంతో పాటు బెన్ఫిట్ షోస్ కూడా అనుమతిని ఇస్తుంది.. తాజాగా పుష్ప 2 సినిమాకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు భారీ టికెట్ రేట్స్ కి అనుమతిని ఇస్తూ స్పెషల్ షోస్ కి కూడా పర్మిషన్ ఇచ్చాయి.. అయితే తెలంగాణలో జరిగిన సంధ్య థియేటర్ ఘటన సంచలనంగా మారడంతో తెలంగాణ ప్రభుత్వం సినిమా వారిపై కాస్త కఠినంగా వ్యవహారిస్తుంది..తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇవ్వబోమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీలో శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించారు. టికెట్ల రేట్లను పెంచేందుకు కూడా అనుమతి ఇచ్చేది లేదని వారు తేల్చి చెప్పారు.

హామీ ఇస్తున్నా.. అస్సలు నిరాశ పరచను.. చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబాన్ని తమ ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన వెల్లడించారు.అంతకుముందు.. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సెలబ్రిటీలంతా సినిమాలు తీసుకోండని, బిజినెస్ చేసుకోండని అన్నారు. ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు కూడా తీసుకోండని ఆయన తెలిపారు. షూటింగ్లకు ప్రత్యేక అనుమతులు కూడా తీసుకోండని అన్నారు. కానీ ప్రజల ప్రాణాలు పోతుంటే తమ ప్రభుత్వం మాత్రం చూస్తూ ఊరుకోదని వారిని హెచ్చరించారు.ప్రజల ప్రాణాలు పోయే ఘటనలు జరిగితే మాత్రం ఇకపై ప్రత్యేక మినహాయింపులు అస్సలు ఉండవని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎలాంటి బెనిఫిట్‌ షోలు, టికెట్ల రేట్ల పెంపునకు అనుమతివ్వబోమని తేల్చి చెప్పేశారు. దీంతో సినీ ఇండస్ట్రీలో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అప్ కమింగ్ బడా చిత్రాల పరిస్థితేంటని అంతా మాట్లాడుకుంటున్నారు.ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో దిల్ రాజు గ్రాండ్ గా రూపొందించారు..రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తూ ఆడియన్స్ లో మూవీపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు.పుష్ప-2 సినిమాకు అందినట్లే తెలంగాణలో అన్ని అనుమతులు గేమ్ ఛేంజర్ కు దక్కుతాయని అంతా భావించారు..కానీ ఇప్పుడు తెలంగాణ సీఎం సంచలన ప్రకటనతో గేమ్ ఛేంజర్ పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నారు..

Related posts

పుష్ప 2 : ఐకాన్ స్టార్ సినిమాకి ఆ మెగా హీరో బెస్ట్ విషెస్..

murali

ఆ విషయంలో దేవరతో పోలిస్తే పుష్ప వంద రెట్లు బెటర్ ..బన్నీ స్ట్రాటజీ అదిరిందిగా ..!!

murali

పుష్ప 2 : 1000 కోట్ల సినిమాపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన రాజేంద్రప్రసాద్..!!

murali

Leave a Comment