MOVIE NEWS

అక్కడ గేమ్ ఛేంజర్ రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్.. తొలిగిన అడ్డంకులు..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్‌ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ పాన్-ఇండియా పొలిటికల్ డ్రామా ‘గేమ్ ఛేంజర్’.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 10 న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది..ఈ సినిమా మరో రెండు రోజుల్లో విడుదల కానుండటంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు..బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ, క్యూట్ బ్యూటీ అంజలీ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించారు.

బాలయ్య, ఎన్టీఆర్ వివాదం.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ బాబీ..!!

ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు తమిళనాడులో అడ్డంకులు ఏర్పడ్డాయి..లైకా ప్రొడక్షన్స్ గేమ్ ఛేంజర్ విడుదలను అడ్డుకుంటున్నట్లు సమాచారం.దర్శకుడు శంకర్ ఇండియన్ 3 పూర్తి చేసి  విడుదల చేసే వరకు తమిళనాడులో గేమ్ ఛేంజర్ విడుదలను నిలిపివేయాలని లైకా తమిళ నిర్మాతల మండలిని ఆశ్రయించిందని సమాచారం.. అయితే ఈ వార్త రామ్ చరణ్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇదిలా ఉంటే తాజాగా అక్కడ డిస్ట్రిబ్యూటర్ నుండి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది..తమిళనాడులో గేమ్‌ఛేంజర్ గ్రాండ్ రిలీజ్ కోసం అన్ని డెక్‌లు క్లియర్ చేయబడ్డాయి.. తమ అభిమానాన్ని, సపోర్ట్‌ని అందించిన ఫిల్మ్‌ ఫ్రెటర్నిటీ సర్కిల్స్‌ అందరికీ ధన్యవాదాలు అని తెలిపారు..

రాక్‌ఫోర్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ తమిళనాడులో గేమ్ ఛేంజర్‌ను గ్రాండ్ గా విడుదల చేస్తోంది. రేపటి నుంచి ఈ సినిమా బుకింగ్స్ మొదలు కానున్నట్లు సమాచారం..ఇదిలా ఉంటే ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ సందర్భంగా మేకర్స్ ఈ సినిమా నుంచి మిగిలిన సాంగ్స్ రిలీజ్ చేసారు. ఇప్పటికే ఈ సినిమా నుండి నాలుగు పాటలు రిలీజ్ కాగా ఆ పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి..

Related posts

ఆ హీరో పై త్రివిక్రమ్ కామెంట్స్.

filmybowl

విశ్వంభర : మెగాస్టార్ మూవీ సమ్మర్ కి కూడా కష్టమేనా..?

murali

పుష్ప 2 గురించి దేవి మాటల్లో..

filmybowl

Leave a Comment