MOVIE NEWS

‘డ్రాగన్’ టైటిల్ దాదాపు ఫిక్స్.. కానీ కొంచెం సస్పెన్స్..!!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ బిగ్గెస్ట్ మూవీ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న మరో బిగ్గెస్ట్ మూవీ ‘వార్ 2’ఈ ఏడాది ఆగష్టు 14న విడుదల కాబోతుంది.ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అవ్వడంతో ఎన్టీఆర్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఈ నెల 22న నుంచి మొదలు అవ్వబోయే రెండవ షెడ్యూల్ లో ఎన్టీఆర్ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బాగా సన్నబడ్డాడు.ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని మొదలు పెట్టి ఎన్టీఆర్ లేని సన్నివేశాలను ప్రశాంత్ నీల్ తెర కెక్కించారు..

బాలయ్య తో మరో ఊర మాస్ మూవీ ప్లాన్ చేస్తున్న ఆ స్టార్ డైరెక్టర్..!!

కొన్ని యదార్ధ సంఘటనలను ఆధారంగా ఈ సినిమాని దర్శకుడు ప్రశాంత్ నీల్ చిత్రీకరించబోతున్నాడు. ఏప్రిల్ 22 నుండి మూడు వారాల పాటు ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని ప్రశాంత్ నీల్ షూట్ చేయనున్నాడు. మే 20 వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఒక గ్లింప్స్ వీడియో ని విడుదల చేసే ప్లాన్ లో మేకర్స్ వున్నారని సమాచారం..ఈ గ్లింప్స్ వీడియో తోనే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అభిమానులకు చూపించబోతున్నారు.అయితే ఈ సినిమా టైటిల్ ‘డ్రాగన్’ అనే పేరు దాదాపుగా ఫిక్స్ అయిపోయినట్టే అని తెలుస్తుంది..కానీ ఇంకా మంచి టైటిల్స్ ని కూడా మేకర్స్ పరిశీలిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా కలిసి ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన లో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించనుంది. అలాగే కేజీఎఫ్ సిరీస్, సలార్ వంటి భారీ సినిమాలకు మ్యూజిక్ అందించిన రవి బస్రూర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించబోతున్నాడు.

 

Related posts

పుష్ప 2 : భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మొదలైన ఏర్పాట్లు.. వేదిక ఎక్కడంటే..?

murali

పెద్ది : ఊహించని సర్ప్రైజెస్.. బుచ్చి బాబు ప్లాన్ మాములుగా లేదుగా..!!

murali

స్పిరిట్ : బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా..!!

murali

Leave a Comment