MOVIE NEWS

“కింగ్డమ్” గా వస్తున్న రౌడీ స్టార్.. టీజర్ మాములుగా లేదుగా..!!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. గత కొంత కాలంగా వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న రౌడీ స్టార్ ఈ సారి ఎలాగైనా తన కెరీర్ టర్న్ అయ్యే హిట్ అందుకోవాలని భావిస్తున్నాడు.. అందులో భాగంగా కథా బలం వున్న స్క్రిప్ట్ లను ఎంచుకుంటున్నాడు.. వరుస బిగ్ మూవీస్ ని తన లైనప్ గా ఏర్పరుచుకున్నాడు.. ప్రస్తుతం జెర్సీ సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తన 12 వ మూవీ చేస్తున్నాడు..”VD12” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోన్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు.ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍గా నటిస్తుంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీని మేకర్స్ మే 30న రిలీజ్ చేయనున్నారు..

సెన్సార్ పూర్తి చేసుకున్న విశ్వక్ సేన్ ‘లైలా’.. రన్ టైం ఎంతంటే..?

తాజాగా ఈ సినిమా టైటిల్ ను ఫిబ్రవరి 12 రివీల్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు….ఈ టైటిల్, టీజర్ కు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ముగ్గురు వేర్వేరు ఇండస్ట్రీ ల స్టార్ హీరోలను మేకర్స్ రంగంలోకి దింపారు..ఈ సినిమా టైటిల్ టీజర్‌ హిందీ వెర్షన్‍కు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్, తమిళ్ వెర్షన్ కు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అలాగే తెలుగు వెర్షన్ కి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు..తాజాగా ఈ టీజర్ రిలీజ్ అయింది.. “కింగ్డమ్”అనే టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

ఈ సినిమా టీజర్ ని గమనిస్తే… ఎన్టీఆర్ గంభీరమైన వాయిస్ తో మొదలవుతుంది.. ప్రేక్షకులకు సరికొత్త ప్రపంచాన్ని చూపిస్తున్నట్లు విజువల్స్ మైమరిపించాయి.. అలాగే హీరో గురించి ఎన్టీఆర్ అదిరిపోయే ఎలివేషన్, విజయ్ లుక్, డైలాగ్స్, అనిరుధ్ సూపర్ బిజిఏం సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది..

 

Related posts

రాజమౌళి మూవీ కోసం మహేష్ స్పెషల్ ట్రైనింగ్..!!

murali

లోకేష్ కనగరాజ్ కూలీ ఫుటేజ్ లీక్ వివాదంపై స్పందన.

filmybowl

వస్తున్నాం.. దుల్లగొడుతున్నాం.. తండేల్ సక్సెస్ గ్యారెంటీ అంటున్న గీతా ఆర్ట్స్..!!

murali

Leave a Comment