MOVIE NEWS

సూపర్ స్టార్ మూలంగానే ఆ కథ రాసా.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన బిగ్గెస్ట్ మూవీ “సంక్రాంతికి వస్తున్నాం”..స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మించాడు.దర్శకుడు అనిల్ రావిపూడి తన స్టైల్ ఆఫ్ కామెడితో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. దర్శకుడు అనిల్ రావిపూడి. వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమాగా ఈ సినిమా తెరకెక్కింది.. హీరో వెంకటేష్ ఈ సినిమాలో తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు.. ఈ సినిమాలో వెంకటేష్ మాజీ పోలీస్ గా నటించాడు.. అలాగే వెంకీ భార్య గా ఐశ్వర్య రాజేష్ మాజీ ప్రేయసి గా మీనాక్షి చౌదరి అద్భుతంగా నటించారు.సంక్రాంతి కానుకగా జనవరి 14 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా 230 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి మరిన్ని కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది అయితే ఈ సినిమా స్టోరీ రాయడానికి కారణం సూపర్ స్టార్ మహేష్ అంటూ అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి..

పుష్ప 3 : ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేస్తే బాగుంటుంది.. దేవిశ్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఒక యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ గారు ఈ సినిమా చూసి ఎంతో ఎంజాయ్ చేశారు. అలాగే ఈ జానర్ లో సినిమా చేయమని నాకు సలహా ఇచ్చిందే ఆయనే..భగవంత్ కేసరి సినిమా చేస్తున్నప్పుడు మీరు కామెడీ బాగా చేస్తారు మీకు ఆ స్ట్రెంత్ ఉంది.మీరు ఒక డిఫరెంట్ మూవీ ట్రై చేయండి, మీరు  కచ్చితంగా ఇండస్ట్రీని షేక్ చేస్తారని ఆయన ఎప్పుడో చెప్పారు. ఆయన జైలర్ సినిమా చూశాక నాకు ఈ మాటలు చెప్పారు.

మన ఇండస్ట్రీలో మీకు ఆ పొటెన్షియల్ ఉంది మీరు దాన్ని జాగ్రత్తగా వాడుకోండి అని జైలర్ రిలీజ్ అయిన తర్వాత మహేష్ గారు నాకు కాల్ చేసి చెప్పారు. ఈ విషయం మీద నాతో దాదాపు 45 నిమిషాల పాటు మాట్లాడారు. ఈ సినిమా తీయడానికి నా మైండ్ లో విత్తనం నాటేలా చేసింది మహేష్ గారే అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.

 

Related posts

గేమ్ ఛేంజర్ : రన్ టైం విషయం లో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్..?

murali

రాబోయే పదేళ్లలో సుకుమార్ చేసేది కేవలం 3 సినిమాలేనా..?

murali

పుష్ప 2 : దర్శకుడు సుకుమార్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

murali

Leave a Comment