MOVIE NEWS

పవర్ స్టార్ వీరమల్లు సినిమా నుంచి తప్పుకున్న ఆ స్టార్ రైటర్..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉంటూనే వరుస సినిమాలు చేస్తున్నారు.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా భాద్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ ప్రజా సేవ చేస్తూనే తన అప్ కమింగ్ సినిమా షూటింగ్ లలో పాల్గొంటున్నారు.. ఇటీవల జరిగిన ఎన్నికల కారణంగా పవన్ కల్యాణ్ గతంలో ఒప్పుకున్న సినిమాల షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి.. దీనితో పవర్ స్టార్ ప్రస్తుతం ఆ సినిమాలని పూర్తి చేసే పనిలో వున్నారు..పవన్ లైనప్ లో వున్న భారీ సినిమాలలో హరిహర వీరమల్లు సినిమా ఒకటి.. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ పవన్ రాజకీయాలలో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా చాలా లేట్ అయింది.

పుష్ప 3 నుంచి పవర్ ఫుల్ డైలాగ్ లీక్.. మాములుగా లేదుగా..?

ప్రస్తుతం ఈ సినిమా  షూటింగ్ చివరి దశలో ఉంది.అయితే సినిమా చాలా లేట్ అవ్వడంతో ఈ సినిమా నుంచి చాలా మంది తప్పుకున్నారని గతంలో వార్తలు వచ్చాయి. సినిమాకు మెయిన్ పిల్లర్ అయిన డైరెక్టర్ క్రిష్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.డైరెక్టర్ క్రిష్ తప్పుకోవడంతో ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం తనయుడు, డైరెక్టర్ జ్యోతికృష్ణ ఈ సినిమా మిగిలిన భాగాన్ని తెరకెక్కిస్తున్నాడు. అయితేఈ సినిమా నుంచి క్రిష్ ఎందుకు తప్పుకున్నాడో ఇప్పటికి కూడా క్లారిటీ లేదు.. తాజాగా స్టార్ రైటర్ బుర్రా సాయి మాధవ్ కూడా హరిహర వీరమల్లు సినిమా నుంచి తప్పుకున్నాను అని తెలిపి షాక్ ఇచ్చారు..

గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ.. నేను కూడా ఎప్పుడో హరిహర వీరమల్లు సినిమా నుంచి తప్పుకున్నాను. డైరెక్టర్ క్రిష్ తో పాటే నేను కూడా బయటకు వచ్చేసాను. కానీ సినిమా మాత్రం అద్భుతంగా ఉంటుందని ఆయన తెలిపారు..నేను కూడా ఆ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను అని ఆయన తెలిపారు. దీంతో ఆయన కామెంట్స్ బాగా వైరల్ గా మారాయి.ఈ సినిమా మార్చ్ 28న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది.

Related posts

పుష్ప 3 సెట్స్ మీదకి వెళ్ళేది ఎప్పుడంటే..?

murali

మావయ్య నాగబాబుని కలిసిన ఐకాన్ స్టార్.. వీడియో వైరల్..!!

murali

ఆ స్టార్ హీరోల ఫ్యాన్స్ కి కోపం తెప్పించిన శ్రీలీల.. అసలు ఏం జరిగిందంటే..?

murali

Leave a Comment