నందమూరి నటసింహం బాలయ్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహారాజ్ సినిమాతో బాలయ్య బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు..ప్రస్తుతం అదే జోష్ లో మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రీసెంట్ గా హిమాలయాలలో అఘోరాకు సంబంధించిన కీలక సన్నీవేశాలు మేకర్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది దసరా కానుకగా సెప్టెంబర్ 25 న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
తారక్ నటనతో కుమ్మేసాడు.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!
ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఇదిలా ఉంటే అఖండ 2 సినిమాతో పాటు బాలయ్య నెక్ట్స్ సినిమా కూడా ఫిక్స్ అయింది. తనకు గతంలో వీరసింహ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ మూవీ అందించిన గోపీచంద్ మలినేని ఇటీవల బాలయ్యకు ఓ కథ చెప్పాగా దానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.దీనితో ఈ సినిమాకు సంబంధించిన పనులు శర వేగంగా జరుగుతున్నాయి.. ఈ సినిమాను స్టార్ట్ చేసేందుకు మేకర్స్ ముహూర్తం కూడా ఫిక్స్ చేసారు. బాలయ్య బర్త్ డే కానుకగా జూన్ 10న పూజా కార్యక్రమంతో గ్రాండ్ లాంఛ్ చేయనున్నారు.
గతంలో వీరి కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డిలోని బాలయ్య లుక్, గెటప్ ఓ రేంజ్ లో ఉందని ప్రేక్షకుల నుండి ప్రశంసలు కూడా వచ్చాయి..దీంతో మరోసారి గోపిచంద్‌తో సినిమా చేసేందుకు బాలయ్య సిద్ధం అవుతున్నాడు. అయితే ఈసారి గోపీచంద్ మలినేని, బాలయ్యతో చేసే సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుందని సమాచారం.. బాలయ్య తో గోపీచంద్ మలినేని మరో ఊర మాస్ సినిమా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం… ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మించనున్నారు.అఖండ 2 షూటింగ్ పూర్తి అయ్యాక ఈ మూవీ రెగ్యులర్ షూట్ మొదలు కానుంది..