గ్లోబల్ స్టార్ రాంచరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గ్రాండ్ గా నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ కూడా మొదలు అయ్యాయి.. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.. అలాగే క్యూట్ బ్యూటీ అంజలీ కూడా మరో హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమాలో ఎస్. జె. సూర్య, సునీల్, శ్రీకాంత్ వంటి స్టార్స్ కీలక పాత్ర పోషించారు..ఈ సినిమా షూటింగ్ 2021 లోనే మొదలైన.. కంప్లీట్ అవ్వడానికి దాదాపు 3 ఏళ్ళు పైనే టైం పట్టింది. పైగా అప్డేట్స్ వంటివి కూడా సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల.. చరణ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.. ఈ సినిమా షూటింగ్ డిలే అవ్వడం పై తాజాగా నటుడు శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో ఆయన ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
నా కెరీర్ లో ఆ సినిమా చేసి పెద్ద తప్పు చేశా.. చరణ్ షాకింగ్ కామెంట్స్..!!
శ్రీకాంత్ మాట్లాడుతూ.. “ఒక్కో సినిమా అంతే..లేట్ అవుతూ ఉంటుంది. వాతావరణం వల్ల ఏర్పడ్డ సమస్యల వల్ల కావచ్చు, ఆర్టిస్ట్ల కాల్షీట్స్ సర్దుబాటు కాకపోవడం వంటి కారణాల వల్ల షూటింగ్ డిలే అవుతూ ఉంటుంది. ‘గేమ్ ఛేంజర్’ సినిమా విషయానికి వస్తే ఇది శంకర్ గారి సినిమా కావడం, మధ్యలో ఆయన కమల్ హాసన్ గారి ‘ఇండియన్ 2’ చేయాల్సి రావడంతో కొన్ని నెలల పాటు షూటింగ్ జరగలేదు.తర్వాత మళ్ళీ ఆర్టిస్టుల కాల్ సీట్స్ సెట్ చేయడానికి కూడా నెలలు నెలలు టైం పట్టేసేది. అంతెందుకు నా వల్లే సినిమా 3 నెలలు డిలే అయ్యింది. నేను నటించిన ‘దేవర’ సినిమాలో గడ్డంతో కనిపించాను .
‘గేమ్ ఛేంజర్’ కి గడ్డం లేకుండా చేయాల్సి ఉంది. అందువల్ల నేను కూడా ఈ సినిమా షూటింగ్ కి అందుబాటులో లేకుండా పోయాను. అలాగే ఎస్.జె.సూర్య కూడా బిజీ అయ్యారు.అనుకున్న డేట్స్ కి ఆయన కూడా అందుబాటులో ఉండే వారు కారు..అలా ఈ సినిమాకి కాస్త ఎక్కువ టైం పట్టింది. రాజమండ్రిలో ఈ సినిమా షూటింగ్ చేశాం. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ షూటింగ్ అంతా అక్కడే జరిగిందని కచ్చితంగా ఈ సినిమా అందరిని మెప్పిస్తుందని శ్రీకాంత్ తెలిపారు..