పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలే వున్నాయి.. గత ఏడాది ఎన్నికల కారణంగా పవన్ కల్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండి వరుస సినిమాలను హోల్డ్ లో పెట్టారు.. తాజాగా ఆ సినిమాలను పూర్తి చేసే పని లో వున్నారు.. ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “ హరి హర వీరమల్లు “ క్రిష్ జాగర్లమూడి మొదలు పెట్టిన ఈ సినిమా షూటింగ్ అంతకంతకు ఆలస్యం అవడంతో క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.. అప్పటికే ఈ సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తి కాగా మిగిలిన భాగాన్ని ఈ సినిమా నిర్మాత అయిన ఏఎం రత్నం పెద్ద కుమారుడు జ్యోతి కృష్ణ పూర్తి చేస్తున్నాడు.. ఈ సినిమాలో పవర్ స్టార్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఆస్కార్ విన్నర్ ఎం. ఎం. కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు..ఈ సినిమాను మేకర్స్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.. మొదటి భాగాన్ని మార్చిలో రిలీజ్ చేయనున్నారు..
“మాస్ జాతర” గ్లింప్స్ అదిరిందిగా..వింటేజ్ రవితేజ కంబ్యాక్ గ్యారెంటీ..!!
ఇదిలా ఉంటే పవన్ లైనప్ లో వున్న మరో భారీ సినిమా “ ఓజి”..సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..”ఓజి” మూవీని స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య డీవివి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. రీసెంట్ గా ఈ సినిమా గ్లింప్స్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేయగా తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫ్యాన్స్ లో గూస్ బంప్స్ తెప్పించింది..”ఓజి” సినిమా పవర్ స్టార్ మార్క్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది..ఈ సినిమా కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈమధ్య స్టార్ సినిమాలన్నీ కూడా రెండు భాగాలుగా వస్తున్నాయి. ఓజీపై ఉన్న అంచనాలు చూస్తే ఈ సినిమాను కూడా రెండు భాగాలు చేస్తారని అంతా అనుకుంటున్నారు.
ఐతే ఓజీని రెండు భాగాలు చేయాలని డైరెక్టర్, ప్రొడ్యూసర్ అనుకుంటున్నా పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు నో చెబుతున్నట్లు సమాచారం.. ఇప్పటికే కమిటైన సినిమాల విషయంలో పవన్ కళ్యణ్ డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతున్నాడు. ఇప్పుడు ఒక్కో సినిమాకు రెండు భాగాలు అంటే సమయం చాలా కావాల్సి వస్తుందని ఆయన రెండు భాగాలకు అస్సలు ఒప్పుకోవడం లేదు..