MOVIE NEWS

“రౌడీ జనార్దన్” గా వస్తున్న రౌడీ స్టార్..!!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. దీనితో ట్రాక్ మార్చిన ఈ యంగ్ హీరో సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ టైటిల్ టీజర్ ని రిలీజ్ చేసారు.. “కింగ్డమ్” అనే పవర్ ఫుల్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది..ఈ సినిమా టైటిల్ టీజర్ కి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించాడు.. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట అదిరిపోయే వ్యూస్ తో దూసుకుపోతుంది..

SSMB : రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్..సెట్స్ లోకి అడుగుపెడుతున్న ఆ స్టార్ హీరో..!!

అలాగే పాన్ ఇండియా వైడ్ విజయ్ దేవర కొండకు సూపర్ క్రేజ్ ఏర్పడింది.. ఇదిలా ఉంటే ఈ రౌడీ స్టార్ టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్ లో మరో భారీ మూవీ చేస్తున్నాడు.. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన “ఫ్యామిలీ స్టార్”మూవీ అంతగా ఆకట్టుకోలేదు.. దిల్ రాజు కి ఫ్యామిలీ స్టార్ సినిమా నష్టాలు మిగిల్చింది..విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా కనీసం ఓపెనింగ్స్ రాబట్టుకోలేపోయింది.అయితే మళ్ళీ దిల్ రాజు బ్యానర్ లోనే విజయ్ మరో భారీ మూవీ చేస్తుండటం విశేషం..రాజావారు రాణి వారు ఫేమ్ రవికిరణ్ కోలా డైరెక్టర్ గా దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ సినిమా పనులు సైలెంట్ జరుగుతున్నాయి.

తాజాగా ఈ సినిమాకి అఫీషియల్ గా టైటిల్ ఫిక్స్ చేశారు నిర్మాత దిల్ రాజు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీరిలీజ్ ప్రెస్ మీట్ లో విజయ్ సినిమా టైటిల్ ని దిల్ రాజు అనౌన్స్ చేసారు… విజయ్ తో “రౌడీ జనార్ధన్” అనే సినిమా చేస్తున్నాం అని అలాగే నితిన్ తో ఎల్లమ్మ సినిమా మొదలవుతుందని దిల్ రాజు అనౌన్స్ చేసారు..

 

Related posts

RC16 : స్టోరీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. రత్నవేలు పోస్ట్ వైరల్..!!

murali

పుష్ప 2 : “కిస్సిక్ ‘సాంగ్ పై బిగ్ అప్డేట్..మేకర్స్ స్ట్రాటజీ మాములుగా లేదుగా..!!

murali

అందరూ కలిసి బన్నీని ఒంటరి చేసారు.. సంధ్య థియేటర్ ఘటనపై పవన్ షాకింగ్ కామెంట్స్..!!

murali

Leave a Comment