
NTR – Devara :
ఏదైనా సినిమా బాగా ఆడుతుంటే డ్రీం రన్ అంటారు.
కలెక్షన్స్ అనుకున్న దానికంటే కలెక్ట్ చేస్తుంటే బ్లాక్ బస్టర్ అంటారు
అస్సలు షో పడకముందే , ఇంకా రెండు రోజులు టైం ఉండగానే
పెట్టిన డబ్బుల్లో థియేట్రికల్ రన్ నుంచి 50 – 60 శాతం వెనక్కి వచ్చేస్తే దేవరుడి ఊచకోత అనడం లో తప్పు లేదేమో
6 ఏళ్ళ విరామమో (No Solo hero cinema), లేదా ముందు సినిమా మీద వచ్చిన సైడ్ హీరో అనే కామెంట్స్ తెలీదు గాని NTR అభిమానుల్లో కసి కనిపిస్తుంది
వాళ్ళ హీరో దేంట్లోను తక్కువ కాదు అని నిరూపించడానికి సిద్ధం అయ్యారు . దానికి తగ్గట్టు గానే రిలీజ్ ఐన ట్రైలర్స్ , సాంగ్స్ ఎక్సపెక్టషన్స్ ని పెంచేసాయి.
ఏదైనా షో పెట్టి పెట్టక ముందే హౌస్ ఫుల్ అవుతుంది.
ఇది ఒక చోట కాదు అమలాపురం నుంచి అరబిక్ కంట్రీస్ దాక,
సీమ నుంచి సిలికాన్ వాలీ దాక
సీఈడెడ్ నుంచి కెనడా దాక ప్రతి చోట దేవరుడి తాండవమే కనిపిస్తుంది
Read Also : https://filmybowl.com/telugu/film-new-highlighting-devara-iconic-scenes-and-moments-explained/
షో పడక ముందే వరల్డ్ వైడ్ గా దేవర ఇప్పటి వరకు 60 కోట్లు అడ్వాన్స్ కలెక్షన్స్ కొల్లగొట్టింది అంటే దేవరుడి ప్రభంజనం ఎలా ఉంటుందో ఊహకి అందట్లేదని ట్రేడ్ వర్గాల నుంచి మాటలు వినిపిస్తున్నాయి
దర్శకుడి కొరటాల ముందు సినిమా డిసాస్టర్ ఐన ఆ ఛాయలు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ , హైప్ మీద పడకపోడం NTR రేంజ్ ని తెలియచేస్తుంది
రిలీజ్ ఐన తర్వాత ఒక చిన్న పాజిటివ్ టాక్ దేవరుడి ఆట ని ఆపలేదు
NTR కి మొదటి 1000 కోట్ల సినిమా ఐన ఆశ్చర్యపోవక్కర్లేదు
Follow us on Instagram