MOVIE NEWS

మేము ఈ స్థాయిలో ఉండటానికి కారణం చిరంజీవి గారే.. పవన్ కల్యాణ్ ఎమోషనల్ కామెంట్స్..!!

గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎంత ఎత్తు ఎదిగిన మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదు.. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతి గ్లోబల్ స్థాయికి చేరినా తెలుగు ఇండస్ట్రీ కోసం కృషి చేసిన మహానుభావులను మర్చిపోకూడదు..మేము మూలాలు మరిచిపోలేదు. తెలుగు సినీ పరిశ్రమ పెద్దలందరిని గుర్తు చేసుకుంటూ పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు.

గేమ్ ఛేంజర్ స్టోరీ లీక్ చేసిన శంకర్.. చరణ్ నటనకు ఫిదా..!!

ఈ రోజు పవన్ కళ్యాణ్ ఉన్న, రామ్ చరణ్ ఉన్న, మెగా హీరోలు ఎవరు ఉన్నాగాని దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారు.మీరందరూ గేమ్ చేంజర్ అనొచ్చు.. ఓజి అనొచ్చు… ఆ మూలాలు చిరంజీవి గారి నుంచే వచ్చాయి..ఎక్కడో మారుమూల వున్న ఒక చిన్న పల్లెటూరు మొగల్తూరు అనే ఒక గ్రామంలో ఒక కాలేజీలో చదివిన ఆయన ఈ స్థాయికి వచ్చారు. ఈరోజు మీరు మమ్మల్ని ఎన్ని పేర్లతో పిలిచినా దేనికైనా ఆయనే ఆధ్యులు. నేనెప్పుడూ మూలాలు మరిచిపోను. ఎన్టీఆర్, ఏఎన్నార్ ,కృష్ణ, శోభన్ బాబు లాంటి ఎంతోమంది గొప్పవారు తెలుగు చిత్ర పరిశ్రమ కోసం తమ శక్తి దార పోశారు.

ఈరోజున ఇంత బలంగా సినిమా ఈవెంట్ ఇక్కడ చేసుకోగలిగామంటే కూటమి ప్రభుత్వం, నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఆశీస్సులు, ఆయన సహకారం ఆయన నిరంతర మద్దతు వల్లేఈరోజు ఇంత అద్భుతమైన సభ జరుపుకోగలుగుతున్నాం అని పవన్ కల్యాణ్ అన్నారు… ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలని అదే విధంగా పోలీసువారికి, మీడియా మిత్రులకి కూడా కృతజ్ఞతలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Related posts

Nandamuri Bala Krishna : బాక్సులు బద్దలయ్యే అప్డేట్.. ఇక దబిడి దిబిడే!

filmybowl

ఎన్టీఆర్ ‘వార్ 2’ నుంచి బిగ్ అప్డేట్..యాక్షన్ సీక్వెన్స్ తో హైప్ ఎక్కిస్తున్న మేకర్స్..!!

murali

NC24: నాగచైతన్య కొత్త సినిమా పోస్టర్ అదిరిందిగా..!!

murali

Leave a Comment