పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్’, ‘కల్కి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ప్రభాస్ వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు.. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రాజా సాబ్’ వరుస ఫ్లాప్స్ లో ఉన్న మారుతీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.గత కొంత కాలంగా డిజాస్టర్స్ చూస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగి ఉండుంటే, ఈ చిత్రం వచ్చే నెల 10వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చేది.ఇప్పటికే టాకీ పార్ట్ 80 శాతం కి పైగా పూర్తి అయ్యింది కానీ గ్రాఫిక్స్ వర్క్ మాత్రం చాలా బ్యాలన్స్ ఉందనీ తెలుస్తుంది.. అంతే కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చాలా వరకు పెండింగ్ ఉన్నట్లు సమాచారం..
వింటేజ్ చిరూని చూపిస్తానంటున్న ఆ యంగ్ డైరెక్టర్..!!
దీంతో ఈ సినిమా సెప్టెంబర్ లో అయినా రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ నిరాశలో వున్నారు. రీసెంట్ గా ప్రభాస్ ఈ సినిమాకి సంబంధించిన ఔట్పుట్ ని చూసి అసంతృప్తి వ్యక్తం చేసాడట. గ్రాఫిక్స్ వర్క్ పై డైరెక్టర్, నిర్మాతలపై ప్రభాస్ సీరియస్ అయినట్టు తెలుస్తుంది. గ్రాఫిక్స్ వర్క్ చాలా పూర్ గా ఉందని.. ఇంత చెత్త క్వాలిటీ తో రిలీజ్ చేస్తే అభిమానులకు అస్సలు నచ్చదని ఆలస్యం అయినా పర్వాలేదు గ్రాఫిక్స్ పై రీ వర్క్ చేయాల్సిందిగా ప్రభాస్ సూచించినట్లు సమాచారం..
దీంతో 80 శాతం పూర్తి అయిన గ్రాఫిక్స్ వర్క్ పై మేకర్స్ రీ వర్క్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.. దీనిని బట్టి ఈ సినిమా ఇప్పట్లో రిలీజ్ అవ్వడం కష్టమే అని తెలుస్తుంది..అయితే ఈ సినిమా కంటే ముందు ప్రభాస్ హను రాఘవపూడి తో చేస్తున్న ‘ఫౌజీ’ సినిమా ముందుగా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..