సంధ్య థియేటర్ ఘటన టాలీవుడ్ లో సంచలనంగా మారింది. ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ షో చూసేందుకు సంధ్య థియేటర్ కి వచ్చిన అల్లుఅర్జున్ ని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు.భారీగా జనం రావడంతో థియేటర్ లో తొక్కిసలాట జరిగింది.. ఈ తొక్కిసలాట లో రేవతి అనే మహిళ అక్కడికక్కడే మరణించగా.. ఆమె కొడుకు శ్రీ తేజ్ హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతున్నాడు . ఇదిలా ఉండగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన సంఘటనకు సంబంధించి అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేయగా హైకోర్ట్ మధ్యంతర బెయిల్ ఇచ్చింది..
‘సినిమాలు తీయడం మానేస్తా’.. సుకుమార్ షాకింగ్ కామెంట్స్..!!
అయితే ఈ ఘటన గత రెండు రోజులుగా మరింత సీరియస్ గా మారింది..తాజాగా పోలీసులు బన్నిని విచారణకు రావాలని నోటీసులు పంపించారు. ఈ నేపథ్యంలో పోలీస్ విచారణకు బన్నీ హాజరయ్యారు..విచారణలో భాగంగా పోలీసులు అల్లు అర్జున్ ని వరుస ప్రశ్నలు వేసినట్లు సమాచారం. వాటిలో కొన్ని ప్రశ్నలకు బన్నీ సమాధానం చెప్పలేకపోయారని తెలుస్తుంది.తాజాగా అల్లుఅర్జున్ విచారణ ముగిసింది.. విచారణలో భాగంగా అల్లుఅర్జున్ ని పోలీసులు అడిగిన ప్రశ్నలు ఇవే అంటూ సోషల్ మీడియలో బాగా వైరల్ అవుతున్నాయి..
*సంధ్య థియేటర్ లో ప్రీమియర్ షో చూసేందుకు వస్తున్నట్లు మీరు అనుమతి కోరారా..? ఉంటే ఆ కాపీ ఏమైనా ఉందా…?
*సంధ్య థియేటర్ వద్దకు మీకంటే ముందుగానే మీ PR టీమ్ వెళ్ళింది. అక్కడ ఉన్న క్రౌడ్ పరిస్థితిని మీకు వివరించలేదా…?
*మీరు వచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. అయినా కూడా ఎందుకు రోడ్ షో చేస్తూ వచ్చారు..?
*థియేటర్ బయట తొక్కిసలాట జరిగిన విషయం,ఒక మహిళ చనిపోయిన విషయం చిక్కడపల్లి ఇన్స్పెక్టర్, ఏసీపీ మీకు చెప్పడానికి వస్తే.. మీ మేనేజర్ అడ్డుకున్నారు. నేను సార్ కి చెప్తాను అన్నాడు. మరి మీకు ఆ పరిస్థితి గురించి వివరించాడా…?
*తర్వాత డీసీపీ నేరుగా వచ్చి మీకు చెప్పాడు. కానీ.. మీరు సినిమా మొత్తం చూశాకే వస్తానని ఎందుకు అన్నారు.?
*నాకు ఎవరూ చెప్పలేదు అని ప్రెస్ మీట్ లో ఎందుకు అబద్ధం చెప్పారు..?
ఇలా వరుస ప్రశ్నలు సంధించి అల్లుఅర్జున్ ని పోలీసులు ఇరకాటంలో పెట్టినట్లు సమాచారం.. కొన్ని ప్రశ్నలకు అల్లుఅర్జున్ సమాధానం ఇవ్వలేదని తెలుస్తుంది.. మున్ముందు ఈ కేసు ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి..