న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు..గత ఏడాది రిలీజ్ అయిన హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో నాని వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు.. ప్రస్తుతం నాని లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి.. నాని హీరోగా నటిస్తున్న హిట్ : ది థర్డ్ కేస్ “ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది..ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాలో నాని సరసన కేజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది..అలాగే నాని నటిస్తున్న మరో మోస్ట్ అవైటెడ్ మూవీ “ది ప్యారడైజ్”.. తనకి దసరా వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో నాని ఈ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మాత సుధాకర్ చెరుకూరి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు..
హరిహర వీరమల్లు : పవన్ సినిమా ప్రచార భారమంతా ఆ హీరోయిన్ పైనే..?
‘దసరా’ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ‘ది ప్యారడైజ్’ అనే సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.. ఈ బిగ్గెస్ట్ మూవీ టీజర్ తాజాగా రిలీజ్ అయింది..ఈ మూవీలో ఊహించని విదంగా నాని సరికొత్త అవతారంలో కనిపించి అందరిని ఆకట్టుకున్నాడు.. ఇప్పుడు నెట్టింట ఈ టీజర్ సంచలనం సృష్టిస్తుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది.ఈ సినిమా షూటింగ్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడినట్లు తెలుస్తోంది. వేసవి తరువాత మళ్ళీ షూటింగ్ మొదలు కానున్నట్లు సమాచారం..