న్యాచురల్ స్టార్ నాని రొటీన్ కు భిన్నంగా సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు.. ఇటీవల నాని నటించిన హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి..తాజాగా నాని నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ “హిట్: ది థర్డ్ కేస్ “.. శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీకి నాని నిర్మాతగా కూడా వ్యవహారిస్తున్నాడు..హిట్ ప్రాంచైజీలో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. దీనితో నాని నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..ఇటీవల నాని బర్త్ డే సందర్బముగా టీజర్ ని కూడా రిలీజ్ చేయగా ప్రేక్షకులకి విపరీతంగా నచ్చింది.. ఇదిలా ఉంటే నాని నటిస్తున్న మరో బిగ్గెస్ట్ మూవీ ‘’ ది ప్యారడైజ్’ గతంలో తనకి దసరా వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ఈ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా టీజర్ కోసం తన అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
RC16 : దర్శకుడు బుచ్చిబాబుకు మెగా ఫ్యాన్స్ రిక్వెస్ట్.. దేని గురించి అంటే..?
ఈ సినిమా నుంచి ‘రా స్టేట్మెంట్’ పేరుతో ఈ నెల మూడో తారీఖున టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏకంగా ఎనిమిది భాషల్లో.. అందులోనూ ఇంగ్లిష్, స్పానిష్ లాంగ్వేజెస్‌లోనూ ఈ టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించడంతో ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెరిగింది. ఈ టీజర్ ఇండస్ట్రీని షేక్ చేసేలా ఉంటుందని చిత్ర వర్గాల సమాచారం.
అయితే ఈ సినిమా టీజర్ చాలా ‘రా’గా ఉంటుందని..న్యూస్ వైరల్ అవుతుంది..ఘాటైన బూతులు కూడా ఉంటాయట..’ది ప్యారడైజ్’ టీజర్లో ఫస్ట్ డైలాగ్‌లోనే ఒక పచ్చి బూతు ఉంటుందని.. అది విని ప్రేక్షకులు షాకైపోవడం ఖాయమని తెలుస్తుంది.అలాగే ఈ టీజర్లో నాని లుక్ నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఉంటుందని.. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ అని న్యూస్ వైరల్ అవుతుంది..