MOVIE NEWS

ఓజీ డైరెక్టర్ సరికొత్త ప్రయోగం.. ఫ్యాన్స్ కి పండగే..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.. గత ఏడాది ఎన్నికలు కారణంగా ఆయన నటిస్తున్న మూడు సినిమాల షూటింగ్ పెండింగ్ లో పడ్డాయి.ప్రస్తుతం పవన్ నటిస్తున్న మూడు భారీ సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి…ముందుగా ఆ మూడు ఆ సినిమాలను పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమాకు పవన్ డేట్స్ కేటాయించగా ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. ఈ ఏడాది మార్చి 28 న గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావించారు.. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమాను మేకర్స్ మే 9 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు…ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మరో మోస్ట్ అవైటెడ్ మూవీ “ఓజీ”.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

సూర్య ‘ రెట్రో’ మూవీ సెన్సార్ కంప్లీటెడ్.. రన్ టైం ఎంతంటే..?

పవన్ కళ్యాణ్ ఛాన్నాళ్లకు పవర్ఫుల్ గ్యాంగస్టర్ రోల్ లో కనిపించబోతున్నాడు.. దీనితో ఈ సినిమాని వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలనీ ఫ్యాన్స్ మేకర్స్ ని కోరుతున్నారు.. ఈ సినిమాను సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్నాడు.. ప్రముఖ నిర్మాత దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు..మేకర్స్ ఈ సినిమాను త్వరగా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ రూపొందించుకుంటున్నారు.ప్రస్తుతం పవన్ డేట్స్ కోసం మేకర్స్ ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్‌గా మారింది. .’ఓజీ’ చిత్రాన్ని గత ఏడాది సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ కుదరకపోవడంతో మళ్ళీ ఈ ఏడాదిలో అదే నెలలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్స్ చూపించాలని దర్శకుడు సుజీత్ భావిస్తున్నట్లు సమాచారం.. ఇటీవల రిలీజ్ అయిన తమిళ్ స్టార్ హీరో అజిత్ నటించిన “ గుడ్ బ్యాడ్ అగ్లీ “ మూవీ లో అజిత్ వింటేజ్ లుక్స్ కోసం మేకర్స్ AI ని ఉపయోగించారు.. అది బాగా సక్సెస్ కావడంతో ఓజీకి సైతం AI ని ఉపయోగించాలని సుజీత్ చూస్తున్నట్లు సమాచారం..

 

Related posts

పోటీ లో గెలిచిన అనిల్ రావిపూడి

filmybowl

మరో రంగస్థలం లో చరణ్ – సమంత….

filmybowl

రవితేజ ” మాస్ జాతర ” షురూ.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!!

murali

Leave a Comment