MOVIE NEWS

బన్నీ అరెస్ట్ విషయంలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన న్యాచురల్ స్టార్..!!

ఐకాన్ సార్ అల్లు అర్జున్ అరెస్ట్ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది..అల్లు అర్జున్ అరెస్టుతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ఉలిక్కి పడింది..సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన గత కొంత కాలంగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే..ఈ ఘటన కారణంగా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది.తన తప్పు లేకపోయినా అల్లు అర్జున్ ని అరెస్టు చేయడంతో ఫ్యాన్స్ తో పాటు సామాన్య ప్రేక్షకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.ఈ మేరకు అల్లు అర్జున్ అరెస్ట్ పై ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు,రాజకీయ నాయకులు స్పందించిన విషయం తెలిసిందే.. తాజాగా బన్నీ అరెస్టుపై టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని సైతం స్పందించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఈ విధంగా రాసుకొచ్చారు. ఈ సందర్భంగా నాని స్పందిస్తూ.. సినిమా వాళ్లకు సంబంధించిన ఏ విషయంలోనైనా ప్రభుత్వ అధికారులు, మీడియా చూపించే ఉత్సాహం సాధారణ పౌరులపై కూడా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు..

ఐకాన్ స్టార్ కి భారీ ఊరటనిచ్చిన హైకోర్టు.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు..!!

మనమంతా మంచి సమాజంలో జీవించాలి. అదొక దురదృష్టకర, హృదయ విదారక ఘటన.దీని నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. ఇకపై మరిన్ని జాగ్రత్తలు పాటించి భవిష్యత్తులో ఇలాంటివి అస్సలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.. అయితే ఈ ఘటన వెనుక మనందరి తప్పు ఉంది.కానీ ఆ తప్పుని కేవలం ఒక వ్యక్తిపై ఆపాదించడం కరెక్ట్‌ కాదు అని నాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాని చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్‌గా మారింది. నాని చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అల్లు అర్జున్ అభిమానులు స్పందిస్తూ నానికి థాంక్స్ చెబుతున్నారు..

Related posts

“గేమ్ ఛేంజర్” ఈవెంట్ కి పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్.. ఒకే వేదికపై బాబాయ్, అబ్బాయ్..!!

murali

“విశ్వంభర” హడావుడి తగ్గడానికి కారణం అదేనా..?

murali

డాకు మహారాజ్ ఈవెంట్ కి గెస్ట్ గా పుష్ప రాజ్..?

murali

Leave a Comment