తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కి ఇప్పుడంతగా కలిసి రావట్లేదని చెప్పాలి.. గతంలో భారీ బ్లాక్ బస్టర్స్ అందించిన శంకర్ ఇప్పుడు మరీ పేలవమైన కథలతో ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నాడు.. రజనీకాంత్ నటించిన “2.O” సినిమా నుంచి శంకర్ డౌన్ ఫాల్ మొదలయింది.. రోబో రేంజ్ లో “2.O” సినిమా లేకపోవడంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమాకు కమర్షియల్ సక్సెస్ లభించలేదు..దీనితో శంకర్ తన తరువాత సినిమాను లోకనాయకుడు కమల్ హాసన్ తో మొదలు పెట్టాడు.. 28 ఏళ్ల క్రితం వీరి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “ఇండియన్” కి సీక్వెల్ గా ఇండియన్ 2 ని శంకర్ మొదలు పెట్టాడు.. భారీ తారాగనంతో భారీ బడ్జెట్ తో మొదలైన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది..
ఐకాన్ స్టార్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే.. క్లారిటీ వచ్చేసినట్లేనా..?
దీనితో శంకర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఇచ్చిన కథతో తెలుగులో స్ట్రైట్ సినిమా చేసేందుకు ప్రయత్నించాడు.. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గ్లోబల్ స్టార్ రాంచరణ్ తో శంకర్ మూవీని సెట్ చేసాడు.. అలా తెరకెక్కిన సినిమానే “గేమ్ ఛేంజర్”.. ఈ సినిమా మొదలెట్టిన కొంత కాలానికే ఇండియన్ 2 ప్రొడ్యూసర్స్ తమ సినిమాను ముందు పూర్తి చేయాలనీ న్యాయ పరంగా వెళ్లడంతో దర్శకుడు శంకర్ గేమ్ ఛేంజర్ సినిమాను హోల్డ్ లో పెట్టి ఇండియన్ 2 సినిమాను పూర్తి చేసాడు..
కానీ ఇండియన్2 సినిమా దారుణంగా ప్లాప్ అయింది.. ఒక పార్ట్ గా తెరకెక్కించాల్సిన సినిమాను అనవసర సన్నివేశాలతో రెండు పార్టులుగా విభజించడంతో ఇండియన్ పార్ట్ 2 సినిమా ప్రేక్షకులకు బోర్ కొట్టించింది. అసలు కథ అంత ఇండియన్ 3 లోనే ఉండనున్నట్లు తెలుస్తుంది. అయితే ఇండియన్ 2 ప్లాప్ తో డీలా పడ్డ శంకర్ గేమ్ ఛేంజర్ తో అయినా సక్సెస్ అందుకుంటాడు అనుకుంటే ఆ సినిమా సైతం డిజాస్టర్ గా నిలిచింది.. దీనితో శంకర్ ప్రస్తుతం ఇండియన్ 3 పై దృష్టి పెట్టాడు.. ఈ సినిమాను ముందుగా ఓటిటిలో రిలీజ్ చేయాలను కున్నారు.. కానీ అది కుదరలేదు.. దీనితో కమల్ నటిస్తున్న మణిరత్నం మూవీ ’‘థగ్ లైఫ్ “ రిలీజ్ అయ్యాక ఈ సినిమా రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.. ఆ సినిమా ఊపులోనే ఈ సినిమా సక్సెస్ అందుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు..