MOVIE NEWS

ఓటీటీలో అదరగొడుతున్న గేమ్ ఛేంజర్ హిందీ వెర్షన్..!!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ చేంజర్”. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాని గ్రాండ్ గా తెరకెక్కించారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.అయితే రిలీజ్ అయిన మొదటి షో నుంచే నుంచే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు…దీనితో ఈ సినిమాకు అన్ని భాషలలో నెగటివ్ టాక్ వచ్చింది.. దీనితో ఈ సినిమా ఓటిటిలోకి త్వరగా వచ్చేసింది..

మెగాస్టార్, అనిల్ రావిపూడి మూవీ గ్రాండ్ ఓపెనింగ్ ఎప్పుడంటే..?

ఈ సినిమా డిజిటల్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది..ఈ సినిమా ఇప్పటికే సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అయిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా హిందీలో కూడా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది…. ఏకంగా 400 కోట్ల రూపాయల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం 195 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. దిల్ రాజుతో పాటు ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన అందరికీ నష్టాలే మిగిలాయి.

ఇక ఈ సినిమాకి సంబంధించిన సౌత్ లాంగ్వేజ్ డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకోగా.. హిందీ వర్షన్ స్ట్రీమింగ్ హక్కులు మాత్రం జీ5 సంస్థ కొనుగోలు చేసింది..మార్చి 7వ తేదీ నుంచి ఈ సినిమా హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది…అయితే ఈ మూవీ హిందీ వెర్షన్ ఓటీటీ లో దూసుకుపోతుంది..తొలి రోజు నుంచి ఇప్పటీ వరకు ఈ సినిమా టాప్ 10 లో దూసుకుపోతున్నట్లు జీ5 తెలిపింది..250 మిలియన్ మినిట్స్ కి పైగా వ్యూస్ సాధించినట్లు జీ5 పోస్టర్ రిలీజ్ చేసింది..ఇదిలా ఉంటే గేమ్ ఛేంజర్ తో డీలా పడ్డ రాంచరణ్ ఈ సారి సాలిడ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు..

 

Related posts

‘కన్నప్ప’ ని ట్రోల్ చేస్తే శివుడి శాపానికి గురైనట్లే.. రఘుబాబు షాకింగ్ కామెంట్స్..!!

murali

స్పిరిట్ : అదంతా ఫేక్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!!

murali

Unstoppable with NBK : తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయిన వెంకీ మామ.. వీడియో వైరల్..!!

murali

Leave a Comment