The Greatest of All Time – GOAT Movie Review
తారాగణం: విజయ్, స్నేహ, మీనాక్షి చౌదరి, లైలా, ప్రభుదేవా, జయరాం , ప్రశాంత్, మోహన్, వైభవ్, ప్రేమ్ జీ అమరన్, అమీర్ అజ్మల్ తదితరులు
ప్రొడక్షన్: ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్
ప్రొడ్యూసర్స్: కల్పత్తి అఘోరం, కల్పత్తి గణేష్, కల్పత్తి సురేష్
రైటర్ & డైరేక్షన్: వెంకట్ ప్రభు
మ్యూజిక్: యువన్ శంకర్ రాజా
రిలీజ్ డేట్: సెప్టెంబర్ 5, 2024
మురుగదాస్ దర్శకత్వం లో వచ్చిన తుపాకీ సినిమా తో తనకంటూ తెలుగు లో మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న తమిళ హీరో తలపతి విజయ్ . అప్పటి నుంచి వరుసగా అన్ని సినిమాలు తెలుగు లో డబ్ చేస్తూ తన రేంజ్ అతకంతకు పెంచుకుంటూ వెళ్ళాడు
పోయిన ఏడాది LEO తో భారీ ఓపెనింగ్స్ రాబట్టుకున్న విజయ్. ఇప్పుడు The Greatest of All Time – GOAT సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. మరి ఆ గ్రేట్ నెస్ ఏంటో ఒక లుక్కేద్దాం పదండి
కథ ఏంటంటే
గాంధీ (విజయ్) ఒక సీక్రెట్ ఏజెంట్. ఈ విషయం భార్య (స్నేహ) కి కూడా తెలీకుండా జాగ్రత్తపడుతుంటాడు
అజయ్ (అజ్మల్), కళ్యాణ్ (ప్రభుదేవా) , సునీల్ (ప్రశాంత్) అతని టీం మెంబెర్స్. నజీర్ (జయరాం) వీలందరికి బాస్.
ఒక సీక్రెట్ మిషన్ మీద థాయిలాండ్ వెళ్తున్న గాంధీ ని భార్య అనుమానించడంతో వెకేషన్ అని చెప్పి భార్య ని , కొడుకు ని తీసుకొని బయల్దేరతాడు. అక్కడ భార్య కి చెప్పకుండా ఒక మిషన్ లో పాల్గొంటాడు. గాంధీ వళ్ళ నష్టపోయిన ఒక బ్యాచ్ గాంధీ ఫామిలీ మీద ఎటాక్ చేయడంతో, గాంధీ కొడుకు జీవన్ చనిపోతాడు
ఇదంతా చుసిన గాంధీ భార్య తనతో విభేదించి దూరమవుతుంది. గాంధీ కూడా భార్య కి దూరంగా వుంటూ తన సీక్రెట్ ఏజెంట్ పనిని కొనసాగిస్తుంటాడు. కొన్నేళ్ల తర్వాత ఒక పని మీద రష్యా వెళ్లిన గాంధీ కి అక్కడ తన పోలికలతో ఉన్న జీవన్ ఎదురవుతాడు. అతనే తన కొడుకు అని తెలుసుకుని ఇంటికి తీసుకొస్తాడు గాంధీ. కానీ ఇక్కడి నుంచే గాంధీ కి అసలు సమస్యలు మొదలవుతాయి. తనకి ఏదో చెప్పాలని పిలిపించుకునే సమయం లోనే తన బాస్ చనిపోవడం , ఆ మిస్టరీ ఛేదించే సమయం లో తన టీం మెంబెర్స్ ఒకొక్కళ్ళు చనిపోవడం తో గాంధీ కి సవాళ్లు ఎదురవుతాయి. తన బాస్ ని, తన టీం ని చంపింది ఎవరు? అస్సలు ఇన్నాళ్లు జీవన్ ఎక్కడున్నాడు, ఏం చేశాడు ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.
సినిమా ఎలా ఉందంటే:
గ్యాంబ్లర్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకుడు
అద్భుతమైన ఫాo లో ఉన్న తలపతి విజయ్
పైగా విజయ్ ఇక సినిమాలు చేయడు, రాజకీయాలకి వెళ్ళిపోతున్నాడనే ఎమోషన్ తో
ఈ సినిమా ని ఆదరిద్దామని హాల్ లోకి వెళ్లిన ప్రేక్షకుడి కి సినిమా చాలా రొటీన్ గా ఉందనే భ్రమలోనే ఉంటాడు
డీ ఏజింగ్ ఎఫెక్ట్ తో చేసిన సీన్స్ ట్రైలర్ లో చూసి విజయ్ ని ట్రోల్ చేద్దామని హాల్ కి వచ్చినవాళ్లు కూడా అలాగే ఎం చేయలేక కుర్చుండి పోతారు
ఈ మాట ఎందుకంటునంటే ఈ సినిమా కి ఊపిరి వచ్చేది జీవన్ పాత్ర తెర పై కనపడ్డప్పుడే . కాస్త ఎమోషన్స్ వర్కౌట్ అయ్యేది ఆ పాత్రతోనే
ఇలాంటి కథ ఎన్నో సార్లు, ఎన్నో సినిమాల్లో చూసిందే. హీరో ఒక సీక్రెట్ ఏజెంట్ , అతని వాళ్ళ ఫామిలీ ఇబ్బందుల్లో పడటం, సొంత టీం ఏ హీరో కి నమ్మకద్రోహం చేయడం.. ఈ విషయం తెలుసుకొని హీరో వాళ్ళందరిని అంతమొందించడం. కాకపోతే ఇదే కథ లో తండ్రి -కొడుకుల మధ్య శత్రుత్వం పెట్టి వెంకట్ ప్రభు తనదైన స్క్రీన్ ప్లే తో సినిమా ని ఉన్నంతలో బానే నడిపించాడు. కావలసినప్పుడు తండ్రి- కొడుకు మధ్య ఎమోషన్ ని వాడుకున్నాడు అదే టైం లో ఎలేవేషన్ కి వాడుకున్నాడు .
మొదటి సగం లో హీరో ఎంట్రీ ఫైట్, ఇంటర్వెల్ మెట్రో ట్రైన్ ఫైట్ తప్పిస్తే మధ్యలో అంత రొటీన్ వ్యవహారమే
ఇంటర్వెల్ ఫైట్ తో సెకండ్ హాఫ్ మీద మంచి అంచనాలు ఏర్పడతాయి. ఆ అంచనాలని దర్శకుడు బానే అందుకున్నాడని చెప్పచ్చు
సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ట్విస్ట్స్ , స్క్రీన్ ప్లే లోని మేజిక్ సినిమా ని గట్టెక్కిస్తాయి. ఇక క్లైమాక్స్ లో అందరూ చెపుకున్నట్టే IPL మ్యాచ్ ని , ధోని ఇమేజ్ ని చక్కగా వాడుకున్నాడు.
Read Also : 35 – చిన్న కథ కాదు మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం
నటీనటుల పనితీరు
విజయ్ నటనకి వంక పెట్టలేం. డాన్సులు ,ఫైట్లు , కొన్ని హెరొఇచ్ మూమెంట్స్ ఇవన్నీ ఎప్పటిలానే అద్భుతంగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ సినిమా లో కొత్తదనం విజయ్ హీరోఇస్ం తో పాటు విలనిజం కూడా చూడచ్చు. హీరో కంటే విలన్ గా విజయ్ కి ఈ సినిమా లో ఎక్కువ మార్కులు పడతాయి
ఇక సినిమాలోని విజయ్ టీం అందరూ చక్కటి నటన ప్రదర్శించారు , భార్య గా స్నేహ చూడముచ్చటగా వుంది.
మీనాక్షి చౌదరి కనిపించేది కాసేపే ఐన చక్కగా నటించింది. యోగి బాబు కామెడీ కూడా కాసేపు పర్వాలేదు అన్నట్టు ఉంటది
స్పెషల్ అప్పీరెన్స్ లో కెప్టెన్ విజయకాంత్ సినిమా ప్రారంభంలో కనిపించడం చాల బావుంది , అలాగే శివ కార్తికేయ ఎంట్రీ కూడా బాగా పండింది.
ఇక వెంకట్రప్రభు టెక్నికల్ టీం అందరూ కలిసికట్టుగా పని చేసారు
అనిరుద్ మాయ నుంచి బయటకి వచ్చి వింటే యువన్ కూడా మంచి పాటలు, నేపధ్య సంగీతం ఇచ్చాడనే చెప్పచ్చు
డీఎజింగ్ కాన్సెప్ట్ బానే వుంది. కెమెరా పనితనం మరొక హైలైట్ అని చెప్పచ్చు. నిర్మాత ఎక్కడ ఖర్చుకి వెనకడుగు వేయలేదు అనే చెప్పాలి
చివరగా
గ్రేటెస్ట్ అఫ్ అల్ టైం – ఇది వెంకట్ ప్రభు గ్యాంబ్లర్ రేంజ్ కాదు
Filmy Bowl Rating: 2.75/5
Follow us on Instagram