గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “..స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ మూవీని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది.కానీ రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది..దీనితో ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ అందుకోలేదు…
డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కల్కి సీక్వెల్ మొదలయ్యేది అప్పుడే..?
గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది.. అలాగే క్యూట్ బ్యూటీ అంజలి కూడా ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటించింది.., ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్ వంటి స్టార్స్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో గేమ్ ఛేంజర్ సినిమా తెరకెక్కింది..ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో పాటు దిగ్గజ దర్శకుడు శంకర్ తన కెరీర్‌లోనే తొలిసారిగా ఓ స్ట్రెయిట్ తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన నేపథ్యంలో గేమ్ ఛేంజర్‌పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే మిక్స్‌డ్ టాక్‌కు తోడు ఈ సినిమాపై సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. స్వయంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా సినిమాను చంపోద్దని విజ్ఞప్తి చేశారంటే ఈ సినిమా పరిస్ధితి ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు. ఇంతటి టఫ్ సిట్యువేషన్ లో సైతం ఈ సినిమా ఇప్పటి వరకు రూ.130 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది..
ఇదిలా ఉంటే గేమ్ ఛేంజర్ కోసం ఓటీటీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ గేమ్ ఛేంజర్ డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు దక్కించుకుంది..తెలుగు సహా అన్ని భాషలు కలిపి గేమ్ ఛేంజర్ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దాదాపు రూ. 104 కోట్లకు చేజిక్కించుకుందట. నిబంధనల ప్రకారం.. థియేటర్‌లో రిలీజైన 5 వారాల తర్వాత ఏ సినిమా అయినా ఓటీటీలోకి రావాల్సి ఉంటుంది. దీనిని బట్టి గేమ్ ఛేంజర్ ఫిబ్రవరి 14 లేదా 15వ తేదీల్లో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం..