MOVIE NEWS

“పుష్ప 2” మొదటి షో పడింది.. ఇంతకీ టాక్ ఎలా ఉందంటే..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప కి సీక్వెల్ గా వస్తుందటంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. అల్లు అర్జున్ నుండి పుష్ప తరువాత మరో మూవీ వచ్చి దాదాపు మూడేళ్లు అయింది.. దీనితో తమ అభిమాన హీరోని స్క్రీన్ పై చూడాలని ఎంతో ఆత్రుతగా వున్నారు.. ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..ఈ సినిమా విడుదలకు ఇంకో వారం రోజులే సమయం మిగిలింది..

పుష్ప 2 : మ్యూజిక్ కాంట్రవర్సీ..దేవిశ్రీ కామెంట్స్ పై స్పందించిన ప్రొడ్యూసర్..!!

అయితే దర్శకుడు సుకుమార్ షూటింగ్ ఆలస్యం చేయడంతో నిన్నటి వరకు కూడా టీం ఆ పనిలోనే బిజీగా ఉంది. నిన్న మధ్యాహ్నం గుమ్మడికాయ కొట్టేయడంతో టీం అంతా ఊపిరి పీల్చుకుంది. ఆ వెంటనే రాత్రికే ఎడిటింగ్, మిక్సింగ్ కూడా పూర్తి చేసి.. ఈ రోజు ఫస్ట్ కాపీ తీసినట్లు సమాచారం.. సెన్సార్‌ చేయించడానికి మూడు రోజుల నుంచి స్లాట్ తీసుకుంటూనే ఉన్న టీం చివరికి ఈ రోజు కాపీని అందిస్తుంది..అయితే సినిమా సెన్సార్ చేయించడానికి ముందే టీంలోని ముఖ్యుల కోసం స్పెషల్ షో ను వేశారు. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, నిర్మాతలతో పాటు బన్నీ తండ్రి అల్లు అరవింద్ కూడా ఈ షో చూసారు.అన్నపూర్ణ స్టూడియోలో ఉదయం పదిన్నర సమయంలో ‘పుష్ప-2’ షో మొదలైంది.. ఈ షోను టీంతో పాటు అల్లు అరవింద్ కూడా బాగా ఎంజాయ్ చేసినట్లు సమాచారం.

ముఖ్యంగా అల్లు అరవింద్ ఈ మూవీ చూసాక దర్శకుడు సుకుమార్ ని ఎంతగానో అభినందించినట్లు సమాచారం.. సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పి అల్లు అరవింద్ అక్కడి నుంచి చాలా సంతోషంగా బయటకు వచ్చినట్లు తెలుస్తుంది… అందరూ ఊహించినట్లుగానే సినిమాలో సీను సీనుకి గూస్ బంప్స్ వచ్చినట్లు సమాచారం..మొదటి షో పడ్డాక పుష్ప అవుట్ పుట్ చూసుకొని టీం అంతా ఫుల్ హ్యాపీగా ఉందని తెలుస్తుంది.. ఈ షో పూర్తయిన వెంటనే సెన్సార్ కోసం కాపీని పంపించారు. ఈ రోజు రాత్రికి సెన్సార్ సర్టిఫికెట్ రానున్నట్లు సమాచారం…

Related posts

దేవర రికార్డుల ఊచకోత మొదలు

filmybowl

పుష్ప 2 : 1000 కోట్ల సినిమాపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన రాజేంద్రప్రసాద్..!!

murali

తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 కి భారీ ఊరట..టికెట్ రేట్స్ భారీగా పెంపు..!!

murali

Leave a Comment