గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’.. ఈ మూవీ కోసం చరణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఈ మూవీని మేకర్స్ 2025, జనవరి 10న భారీగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేసారు..“గేమ్ ఛేంజర్” మూవీ తెలుగుతో పాటు తమిళ్, హిందీల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది….ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటి కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.. అలాగే క్యూట్ బ్యూటీ అంజలీ సినిమా లో ముఖ్య పాత్ర పోషించింది..
నేను ఏ తప్పు చేయలేదు..అవన్నీ తప్పుడు ఆరోపణలు.. అల్లుఅర్జున్ షాకింగ్ కామెంట్స్..!!
ఈ సినిమా లో రాంచరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు.. ఇదిలా ఉంటే దర్శకుడు సుకుమార్ ‘గేమ్ ఛేంజర్’ మూవీపైన ఫస్ట్ రివ్యూ చెప్పారు.. ‘నేను, చిరంజీవి గారితో కలిసి గేమ్ ఛేంజర్ మూవీ చూశాను. ఫస్టాఫ్ చాలా అద్భుతంగా ఉంది… ఇంటర్వెల్ ట్విస్ట్ ఓ రేంజ్ లో ఉంటుంది… ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అయితే గూస్‌బంప్స్ తెప్పిస్తాయి..క్లైమాక్స్‌లో రామ్ చరణ్ ఎమోషన్స్ పలికించిన విధానం ప్రతి ప్రేక్షకుడికి కన్నీళ్లు తెప్పిస్తుందని ఈ సినిమాలో రామ్ చరణ్ అవార్డు విన్నింగ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు..’ అని డైరెక్టర్ సుకుమార్ తెలిపారు.
డైరెక్టర్ సుకుమార్‌కి ఏ సినిమా అంత ఈజీగా నచ్చదు.దాదాపు మూడేళ్ళ కస్టపడి తీసిన ‘పుష్ప 2’ మూవీ కూడా ఆయనకు పూర్తి సంతృప్తిని ఇవ్వలేదు. దీంతో సుకుమార్‌కి బాగా నచ్చిందంటే ‘గేమ్ ఛేంజర్’ మూవీలో కచ్ఛితంగా అదిరిపోయే కంటెంట్ ఉన్నట్టేనని ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు..మరి గేమ్ ఛేంజర్ సినిమాతో రాంచరణ్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి….