MOVIE NEWS

ప్రభాస్ సినిమాను రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు..ఈ ఏడాది కల్కి సినిమాతో ప్రభాస్ తన కెరీర్ లో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.కల్కి మూవీ ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.ఇదిలా ఉంటే ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటించేందుకు బాలీవుడ్ హీరోయిన్స్ పోటీ పడుతుంటారు.ఇప్పటికే ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్, కృతి సనన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ నటించారు. అయితే ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ మాత్రం ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చినా రిజెక్ట్ చేసిందని సమాచారం. అయితే అది ప్రభాస్ వల్ల కాదట కేవలం ఆ సినిమా తెరకెక్కించే దర్శకుడి కారణంగా అని తెలుస్తుంది…

OG : పవర్ స్టార్ సినిమాలో గ్లోబల్ స్టార్ ఇది కదా మాస్ కాంబినేషన్..?

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న భారీ సినిమాల్లో యానిమల్ మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ సినిమా ఒకటి.. సందీప్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచినా అతని దర్శకత్వ తీరుపై గతంలో చాలా విమర్శలు వచ్చాయి. సందీప్ తన సినిమాల్లో హింసను ఎక్కువగా ప్రోత్సహిస్తార నే అపవాదు ఉంది. అలాగే మహిళలను హీరోలకు బానిసలుగా, తక్కువ చేసి చూపిస్తారనే విమర్శలు కూడా వున్నాయి..తన యానిమల్ సినిమా 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినా పలువురు ప్రముఖులు ఈ మూవీని వ్యతిరేకించారు. సందీప్ పై విమర్శల వర్షం కురిపించారు. ఈ కారణాలతోనే స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సందీప్ రెడ్డి వంగా మూవీలో నటించనని చెప్పినట్లు సమాచారం.

స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు.. కొన్ని అనివార్య కారణాల వల్ల పోలీసు పదవిని పోగొట్టుకున్న ఓ నిజాయితీ గల  ఆఫీసర్ కథగా స్పిరిట్ మూవీ తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఎంతో మంది స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. నయన తార, త్రిష.. ఇలా చాలా మంది పేర్లు వినిపించాయి… ఇక కొన్ని రోజులుగా స్పిరిట్ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించనుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడీ ఆఫర్ ను ఆ బాలీవుడ్ హాట్ బ్యూటీ రిజెక్ట్ చేసిందని తెలుస్తుంది..

Related posts

ఒళ్ళు దగ్గర పెట్టుకో తోలు తీస్తా అంటూ అల్లుఅర్జున్ కి ఏసీపి మాస్ వార్నింగ్..!!

murali

గేమ్ ఛేంజర్ టీజర్‌ వచ్చేది అప్పుడే

filmybowl

పుష్ప 2 : 90 శాతం బిజిఎం నాదే..సామ్ సిఎస్ షాకింగ్ కామెంట్స్..!!

murali

Leave a Comment