టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో వున్నాడు.ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఏకంగా 300 కోట్ల క్లబ్ లోకి వెంకీ మామ జాయిన్ అయిపోయాడు.. సీనియర్ స్టార్ హీరోలందరిలో ఈ రేంజ్ రికార్డు వెంకీ మామకే సొంతం. దీని తర్వాత వెంకీ త్రివిక్రమ్ తో ఓ మూవీ చేస్తున్నాడు.వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. అయితే ఆ సినిమాలకు త్రివిక్రమ్ కేవలం రైటర్ గా వ్యవహారించారు.
ఆ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్.. కన్ఫామ్ చేసిన వెంకీ అట్లూరి..!!
ఛాన్నాళ్లకు త్రివిక్రమ్ దర్శకుడుగా వెంకీ మామ సినిమా చేస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం..ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు అయినట్టు తెలుస్తోంది.నిజానికి అల్లు అర్జున్ హీరోగా భారీ మైథలాజికల్ సినిమా చేయాలని త్రివిక్రమ్ ఫిక్స్ అయ్యారు.. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల బన్నీ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.. దీనితో ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ వద్దకు చేరింది.. ఎన్టీఆర్ ఒప్పుకోవడంతో ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు నిర్మాత నాగావంశీ తెలిపారు..
అయితే ఎన్టీఆర్ తో చేసే సినిమా కంటే ముందే వెంకీ మూవీని కంప్లీట్ చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారంట. ఈ సినిమాలో హీరోయిన్ కోసం త్రిష, రుక్మిణీ వసంత్, నిధి అగర్వాల్ వంటి ముగ్గురి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.. త్రిష, వెంకీ ఇప్పటికే కలిసి సినిమాలు చేశారు. కాబట్టి త్రిషను తీసుకునే అవకాశం లేదని తెలుస్తుంది..ఇప్పుడు టాలీవుడ్ లో రుక్మిణీ వసంత్ పేరు ట్రెండింగ్ లో ఉంది. కానీ వెంకీ సరసన ఆమె కంటే నిధి అగర్వాల్ సెట్ అవుతుందని అంతా భావిస్తున్నట్లు సమాచారం..
