గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’ ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశ పరిచింది..ఇన్నేళ్ల ఫ్యాన్స్ ఎదురుచూపులకు ‘గేమ్ ఛేంజర్’మూవీ న్యాయం చేయలేకపోయింది.. దీనితో ఫ్యాన్స్ మెచ్చే బ్లాక్ బస్టర్ మూవీ ఇవ్వాలని చరణ్ గట్టిగా ఫిక్స్ అయ్యాడు..ఉప్పెన సినిమా తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న బుచ్చిబాబు సన డైరెక్షన్లో రామ్ చరణ్ తన తరువాత సినిమా చేస్తున్నాడు.. “పెద్ది” అనే పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షాట్ గ్లింప్స్ చూసాక బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఓటిటీలకు కాలం చెల్లినట్లే.. నిర్మాత షాకింగ్ కామెంట్స్..!!
ఈ సినిమాపై ప్రేక్షకులలో ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఈ చిత్రంలో చరణ్ పక్కా ఊరమాస్ అవతారంలో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతుందని సమాచారం.సినిమా మొత్తానికి ఆ సాంగ్ హైలెట్ కానుందని తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ స్పెషల్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ కాజల్ చరణ్ తో స్టెప్పులేయనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో వచ్చే స్పెషల్ సాంగ్ అదిరిపోతుందని సమాచారం.. గతంలో వీరిద్దరు కలిసి నటించిన మగధీర, గోవిందుడు అందరివాడేలే సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి… చాలా కాలం తర్వాత ఈ హిట్ పెయిర్ ఇప్పుడు మరోసారి స్క్రీన్ పై కనిపించ నుంది..అయితే ఈ న్యూస్ ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.త్వరలో ఈ విషయం పై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు..