పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ ఏడాది “కల్కి 2898AD” సినిమాతో కెరీర్ లోనే భారీ హిట్ అందుకున్నాడు.. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా 1000కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి పాన్ ఇండియా వైడ్ గా ప్రభాస్ రేంజ్ ఏంటో తెలియజేసింది.. ఇదిలా ఉంటే ప్రభాస్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలు వున్నాయి.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమాతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. . ఈ రెండు సినిమాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి.
ఏముంది మావా సాంగ్.. నిజంగానే “పీలింగ్స్” తెప్పించేసారుగా..!!
రాజాసాబ్ సినిమా షూటింగ్ జనవరిలోగా పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఫౌజీ సినిమా షూటింగ్ సమ్మర్ లో పూర్తి చేయనున్నట్లు తెలుస్తుంది..ఆ రెండు సినిమాల షూటింగ్స్ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత సందీప్ వంగ దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ సినిమా ప్రారంభించనున్నాడు.. ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం వుంది. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ తో సినిమా చేస్తుండటంతో స్పిరిట్ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెరిగాయి…
ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు సందీప్ వంగ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడు.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా గురించి ఆసక్తికర రూమర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది… స్పిరిట్ సినిమాలో అదిరిపోయే స్పెషల్ సాంగ్ ఉంటుందని సమాచారం.ఆ సాంగ్ ఇప్పటికే హర్షవర్ధన్ రామేశ్వర్ ట్యూన్‌ని సిద్ధం చేసినట్లు తెలుస్తుంది..ఆ స్పెషల్ సాంగ్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ నటించబోతుందని సమాచారం..కియారా అద్వానీ వంటి స్టార్ హీరోయిన్ ఐటెం సాంగ్ చేస్తే పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాకు మంచి హైప్ వస్తుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు..
‘సినిమాలు తీయడం మానేస్తా’.. సుకుమార్ షాకింగ్ కామెంట్స్..!!