మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీతో ఫ్యాన్స్ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు.. మళ్ళీ మునుపటిలాగా మెగాస్టార్ వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు.. మెగాస్టార్ తనయుడు రాంచరణ్ సైతం వరుస సూపర్ హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ లో వున్నాడు.. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మెగా ఫ్యాన్స్ పండగలా చేసుకుంటారు.తాజాగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ సినిమాల నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి.అయితే మే 9 మెగా ఫ్యామిలీకి చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే ఇదే రోజున చిరంజీవికి సంబంధించిన ఎన్నో సినిమాలు రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యాయి. అందుకే ఆ రోజున మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమాను మేకర్స్ రీ రిలీజ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా తాజాగా రిలీజ్ చేశారు..
ఉస్తాద్ భగత్ సింగ్ : పవర్ స్టార్ రెమ్యూనరేషన్ ఏకంగా అన్ని కోట్లా..?
ఈ సినిమా కూడా మే 9 న ఇదే రోజున రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అందుకే మళ్లీ అదే రోజున ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీతో రీ రిలీజ్ ట్రెండ్ లో కొత్త రికార్డు సృష్టించాలని మెగాస్టార్ చూస్తున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కూడా మరో ఘనత సాధించారు. లండన్ లోని ప్రముఖ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో చరణ్ మైనపు విగ్రహాన్ని మే 9న ఆవిష్కరించబోతున్నారట. ఇప్పటికే ఈ మ్యూజియంలో టాలీవుడ్ స్టార్ హీరోస్ మహేష్,ప్రభాస్, అల్లు అర్జున్ మైనపు విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు టాలీవుడ్ నుంచి చరణ్ విగ్రహం కూడా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే ఆయన విగ్రహాన్ని మేడం టుస్సాడ్స్ మ్యూజియం వారు ఏర్పాటు చేయబోతున్నారు.మెగా ఫ్యామిలీకి ఎంతో కలిసొచ్చే రోజునే ఈ రెండు గొప్ప వేడుకలు జరగనున్నాయి..