టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ చిరంజీవి బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లు ఇండస్ట్రీకి నాలుగు స్తంబాలుగా వున్నారు.. అయితే ఫ్యామిలీ హీరో అంటే తెలుగు వారికి వెంటనే గుర్తొచ్చే పేరు విక్టరీ వెంకటేష్. ఫ్యామిలీ హీరోగా ఆయన బలమైన ముద్ర వేశాడు. వెంకటేష్ కెరీర్ లో చంటి సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఈ మూవీ తర్వాతే అతనికి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది..వెంకటేష్ లా ఇన్నోసెంటో హీరో క్యారెక్టర్ చేయాలని చాలామంది హీరోలు ప్రయత్నించారు.. కానీ వారెవ్వరికి సాధ్యపడలేదు. అయితే ఇన్నాళ్లకు వెంకీ ముందుకే మరో కొత్త చంటీ వచ్చింది..అవును నిజమే.. చంటిలా వచ్చేది అబ్బాయ్ కాదు. అమ్మాయి.
బాలయ్య షో లో ఆ స్టార్ హీరోకి ఫోన్ చేసిన చరణ్.. షాక్ అయిన ఫ్యాన్స్..!!
వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న “సంక్రాంతికి వస్తున్నాం ” సినిమా ప్రమోషన్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయి. ప్రతిసారీ ఓ ఇంట్రెస్టింగ్ ఐడియాతో అదరగొడుతున్నాడు..సాంగ్స్ విషయంలో అనిల్ చేసిన హడావిడీకి ప్రేక్షకులంతా అంతా ఫిదా అయ్యారు..సంక్రాంతికి వస్తున్నాం టీమ్ నుంచి త్వరలో ఓ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ రాబోతోంది. అయితే ఆ ఇంటర్వ్యూ రెగ్యులర్ యాంకర్స్ తో కాకుండా సినిమాలో ఓ హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య రాజేశ్ చేయబోతోంది.
అయితే ఆమె వెంకీ ‘చంటి’ గెటప్ తో ఇంటర్వ్యూ చేయబోతోంది. ఆ గెటప్ తోనే వెంకీ లా డ్యాన్స్ లు వేస్తూ చేసిన ఓ వీడియో బాగా వైరల్ గా మారింది.సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ కి జస్టిఫికెషన్ ఇచ్చేందుకు మేకర్స్ ఈ సినిమాను కచ్చితంగా సంక్రాంతి రోజే జనవరి 14 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.. వెంకీ మామ ఫ్యామిలీ సెంటిమెంట్ వర్కౌట్ అయితే మాత్రం సినిమా ఓ రేంజ్ కలెక్షన్స్ వస్తాయి.. ఈ సంక్రాంతికి వెంకీ మామ పర్ఫెక్ట్ సినిమాతో వస్తున్నాడు..
Let's celebrate the new year with a very special interview, "VENKY MAMAs tho #SankranthikiVasthunam" ❤️🔥
Presenting @aishu_dil as CHANTI from #CHANTI 😍
Stay tuned for the next one and keep guessing 😉#సంక్రాంతికివస్తున్నాం GRAND RELEASE WORLDWIDE ON 14th JANUARY, 2025. pic.twitter.com/jYNxMrAbGl
— Sri Venkateswara Creations (@SVC_official) December 31, 2024