MOVIE NEWS

గ్లోబల్ స్టార్ తో భారీ మూవీ సెట్ చేస్తున్న ఆ బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్..?

గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్ “.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అయింది..ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూసిన ఫ్యాన్స్ కి ఈ సినిమా ఫలితం షాక్ ఇచ్చింది.రొటీన్ స్టోరి, రొటీన్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు.. దీనితో ఈసారి భారీ హిట్ అందుకోవాలని చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన డైరెక్షన్ లో తన తరువాత సినిమా చేస్తున్నాడు..

అఖండ 2 : హిమాలయాలకు పయనమయిన చిత్ర యూనిట్..!!

”RC16”అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమాను మేకర్స్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.. ఇదిలా ఉంటే బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ తో కలిసి ఓ భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది..

RC16లో బిగ్గెస్ట్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో నటిస్తున్న చరణ్, ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీపై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఆ బాలీవుడ్ నిర్మాత మరెవరో కాదు, కరణ్ జోహార్ అని తెలుస్తోంది.కరణ్ జోహార్ గతంలో తెలుగు సినిమాలతో అనేక అనుబంధాలు కొనసాగించినా, పూర్తి స్థాయిలో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టడం ఇదే తొలిసారి. గత కొంత కాలంగా ఒక టాలెంటెడ్ దర్శకుడితో చరణ్‌ ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మించబోతున్నాడని సమాచారం. బాలీవుడ్, టాలీవుడ్ మార్కెట్‌ను కలిపేలా ఈ సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

 

Related posts

SSMB : మూడు పార్టులుగా మహేష్, రాజమౌళి మూవీ.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

murali

డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. “సలార్ 2” మైండ్ బ్లోయింగ్ అప్డేట్..!!

murali

“వార్ 2 ” కోసం రంగంలోకి సూపర్ స్టార్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!

murali

Leave a Comment