MOVIE NEWS

మెగాస్టార్ మావయ్యకి కృతజ్ఞతలు.. బన్నీ ఎమోషనల్ కామెంట్స్ వైరల్ ..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అల్లుఅర్జున్ ని అరెస్ట్ చేసిన పోలీసులు నాంపల్లి కోర్ట్ లో హాజరుపరిచారు..నాంపల్లి కోర్టు బన్నికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.., ఆ తర్వాత లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలను పరిగణలోకి తీసుకున్న హై కోర్ట్ అల్లు అర్జున్ కి బెయిల్ మంజూరు చేసింది..అయితే కోర్టు వెంటనే అతన్ని విడుదల చేయమని చెప్పినప్పటికీ కూడా, చంచల్ గూడా పోలీసులు ఆయన్ని రాత్రంతా జైలులోనే ఉంచి ఉదయం 6 గంటలకు విడుదల చేశారు.

ఆ సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్.. లేదంటే పరిస్థితి ఎలా ఉండేదో..?

విడుదల చేసిన వెంటనే బన్నీ ముందుగా గీత ఆర్ట్స్ ఆఫీస్ కి వెళ్లి తన తండ్రి అల్లు అరవింద్ ని కలిసి ఆ తర్వాత తన ఇంటికి బయలుదేరీ వెళ్ళాడు. ఇంటికి వెళ్లిన వెంటనే అల్లు అర్జున్ ని కలిసేందుకు సినీ ప్రముఖులందరూ విచ్చేసారు. కాసేపటి క్రితమే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ని కూడా ఏర్పాటు చేసారు.ఈ ప్రెస్ మీట్ లో పోలీసులు అన్యాయంగా తనపై ప్రవర్తించిన తీరు పట్ల రెస్పాన్స్ ఇస్తాడని అంతా అనుకున్నారు..తన కోసం నిలబడిన ప్రతీ ఒక్కరికి అల్లు అర్జున్ కృతఙ్ఞతలు తెలియజేసి నిమిషం లోపే తన ప్రసంగం ని ముగించారు..

అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘నాకు ఇలాంటి కష్ట సమయంలో అండగా నిల్చిన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలిపారు… ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నా అభిమానులు నాపై చూపించిన ప్రేమ కి ధన్యవాదాలు, నేను బాగానే ఉన్నాను, ఎవ్వరూ కంగారు పడొద్దు అని తెలిపారు..అలాగే నిన్న ఉదయం నుండి చిరంజీవి గారి దగ్గర నుండి నా కుటుంబ సభ్యులందరు చాలా కంగారు పడ్డారు’ అని బన్నీ చెప్పుకొచ్చారు.కష్టసమయంలో మావయ్య మా కుటుంబసభ్యులకు అండగా నిలబడ్డారు.. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలని అల్లుఅర్జున్ తెలిపారు.

Related posts

విశ్వంభర” టీజర్.. ఫీడ్ బ్యాక్ ఇదే

filmybowl

సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ చిత్రం

filmybowl

ఎన్టీఆర్ నీల్ సినిమాపై బిగ్ అప్డేట్..పోస్ట్ వైరల్..!!

murali

Leave a Comment