MOVIE NEWS

తండేల్ : ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్.. పోస్టర్ అదిరిందిగా..!!

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “తండేల్”.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన మూడు పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి.కొన్నాళ్ళుగా మంచి విజయం కోసం నాగచైతన్య ఎంతగానో ఎదురుచూస్తున్నాడు..ప్రస్తుతం నాగచైతన్య ఆశలన్నీ “తండేల్” సినిమా మీదనే వున్నాయి…

మీమర్స్ కి మంచి స్టఫ్ ఇచ్చిన రాజమౌళి.. మీమ్స్ తో తెగ రచ్చ చేస్తున్నారుగా..!!

ఈ సినిమాలో నాగ చైతన్య బెస్తవాడిగా కనిపించనున్నాడు. గుజరాత్ తీరంలో సముద్ర జలాల్లో చిక్కుకున్న శ్రీకాకుళానికి చెందిన జాలరి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్దమైంది.ఫిబ్రవరి 7 న ఈ సినిమా గ్రాండ్వి గా రిలీజ్ కానుంది..నాగ చైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ మూవీగా “తండేల్’ తెరకెక్కింది.ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ ని లాంచ్ చెయ్యడానికి మేకర్స్ ఫైనల్ గా ఓ డేట్ ఫిక్స్ చేసి ప్రకటించారు..

ఈ సినిమా ట్రైలర్ ని ఈ జనవరి 28న లాంచ్ చేస్తున్నట్టుగా నాగ చైతన్యపై ఒక ఇంటెన్స్ పోస్టర్ తో మేకర్స్అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ పోస్టర్ లో చైతన్య మాస్అండ్ దగ్గుడ్ లుక్ లో కనిపించారు..ఈ సినిమాలో నాగ చైతన్య ఫుల్ మాస్ రోల్ చేస్తున్నట్లు ఈ పోస్టర్ చూస్తేనే అర్ధం అవుతుంది.ఈ పోస్టర్ తో రానున్న ట్రైలర్ పై అంచనాలు పెరిగాయి.. ట్రైలర్ కనుక ఆకట్టుకుంటే మాత్రం నాగ చైతన్య సినిమాపై మరింత బజ్ ఏర్పడుతుంది.. అక్కినేని అభిమానులంతా ఈ సినిమా ట్రైలర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమాతో నాగ చైతన్య కచ్చితంగా బ్లాక్ బస్టర్ అందుకుంటారని వారు ధీమాగా వున్నారు..

 

Related posts

గేమ్ ఛేంజర్ : చరణ్, అంజలీ ఫ్లాష్ బ్యాక్ సాంగ్ వచ్చేసింది..!!

murali

Unstoppable : అకిరా నందన్ సినీ ఎంట్రీ పై చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..?

murali

మోక్షజ్ఞ డెబ్యూ సినిమా గురించి .. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్

filmybowl

Leave a Comment