టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తమ్ముడు”.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో దిల్ రాజు, శిరీష్ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లయ కీలక పాత్ర పోషిస్తుంది..ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, కాంతారా ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్స్ గా నటించారు..జూలై 4న “తమ్ముడు” సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇటీవల రిలీజ్ చేసిన థియేట్రీకల్ ట్రైలర్ కు సినిమాపై మంచి అంచనాలు పెంచింది.అయితే చిత్ర నిర్మాతలలో ఒకరైన శిరీష్ అనుకోని వివాదంలో చిక్కుకున్నారు..
విశ్వంభర : రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన వశిష్ఠ.. ఈ ఏడాది లేనట్లేనా..?
ఈ ఏడాది ప్రారంభం లో రిలీజ్ అయిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా మూలంగా తమకు భారీ నష్టాలు వచ్చాయని..హీరో చరణ్ కానీ అలాగే దర్శకుడు శంకర్ కానీ కనీసం మమల్ని పలకరించలేదు అని ఆయన కామెంట్స్ చేసారు. శిరీష్ చేసిన ఈ వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది. మా హీరో జోలికి రావొద్దు అంటూ హెచ్చరిక లేఖలు విడుదల చేయడంతో మెగా ఫ్యాన్స్ కు క్షమాపనులు చెప్తూ నిర్మాత శిరీష్ లెటర్ రిలీజ్ చేసారు.
అయితే శిరీష్ చేసిన వ్యాఖ్యలు నితిన్ నటిస్తున్న తమ్ముడికి అనుకోని గండం గా మారాయి… నితిన్ నటిస్తున్న తమ్ముడు సినిమా రెండు రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా ప్రమోషన్స్ కంటే గేమ్ ఛేంజర్ గురించే సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. అలాగే దిల్ రాజు, శిరీష్ నిర్మించే తమ్ముడు సినిమాను చూడొద్దని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు.హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న నితిన్ కు ఈ న్యూస్ షాక్ కలిగించింది.. అనుకోని వివాదం నితిన్ సినిమాకు చుట్టుకోవడంతో నితిన్ ఫ్యాన్స్ సైతం తెగ ఫీల్ అవుతున్నారు..
