గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “ తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఫ్యాన్స్ లో ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ “కియారా అద్వానీ” హీరోయిన్ గా నటించింది.. అలాగే ఎస్. జె సూర్య, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర వంటి స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు..
ఈ సినిమాను మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ స్పీడ్ పెంచారు. ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించారు.. ఈ ఈవెంట్ కి హాజరైన రాంచరణ్ తన డాన్స్ తో ప్రేక్షకులని ఎంతగానో అలరించారు.. ఇదిలా ఉంటే గేమ్ ఛేంజర్ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. తాజాగా తమన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో బాగా వైరల్ గా మారింది..
బన్నీ ఇష్యూలో సూపర్ ట్విస్ట్.. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్న స్టార్ కమెడియన్..!!
గ్లోబల్ స్టార్ రాంచరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిందే..RRR సినిమా సమయంలో చరణ్, ఎన్టీఆర్ మధ్య బాండింగ్ చూసి అందరూ ఎంతగానో ఆశ్చర్యపోయారు.. ఆ సినిమా రిలీజ్ అయి ఆస్కార్ వేడుకల దాకా వెళ్లొచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరూ కలిసి కనపడలేదు.తాజాగా గ్లోబల్ స్టార్ రాంచరణ్,ఎన్టీఆర్ లు అమెరికాలో కలుసుకున్నారు.. ఆ ఇద్దరి గ్లోబల్ స్టార్స్ తో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తాను దిగిన ఐకానిక్ ఫోటోని షేర్ చేస్తూ.. దోప్ మూమెంట్. వాట్ ఫన్. బ్రదర్స్ లవ్ అని పోస్ట్ చేసాడు. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
#Dhop MOMENT 🔥@tarak9999 @AlwaysRamCharan
WHAT FUNNNNNNNNN !!
It’s all BROTHER LOVE ❤️ pic.twitter.com/qlUNXMPg5Z— thaman S (@MusicThaman) December 23, 2024