MOVIE NEWS

సమ్మర్ రేస్ నుంచి తప్పుకున్న తలైవా “కూలీ”.. కారణం అదేనా..?

తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గత కొంతకాలంగా వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతూ వచ్చారు.. కానీ నెల్సన్ తెరకెక్కించిన “జైలర్” సినిమాతో తలైవా సూపర్ కంబ్యాక్ ఇచ్చాడు.. ఆ సినిమా భారీగా కలెక్షన్స్ సాధించి రజినీ స్టామినా ఏంటో నిరూపించింది..ఆ సినిమా తరువాత రజినీ నటించిన లాల్ సలామ్ డిజాస్టర్ గా నిలిచింది..అలాగే గత ఏడాది దసరా కానుకగా రజినీ నటించిన “వేట్టయాన్” గ్రాండ్ గా రిలీజ్ అయింది.. జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ సినిమా జైలర్ రేంజ్ హిట్ అందుకోకపోయిన ఓ మోస్తరు సక్సెస్ సాధించింది..

అమ్ముడు పోని”దేవర” శాటిలైట్ హక్కులు.. కారణం అదేనా..?

ఇదిలా ఉంటే ప్రస్తుతం తలైవా రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కూలీ” కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ రూపొందిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి… సౌత్ లో జైలర్ తర్వాత ఆ రేంజ్ హైప్ తో వస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం.. ఈ సినిమాలో కూడా పలువురు బడా స్టార్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు.. గతంలో వచ్చిన జైలర్ సినిమాలో కూడా మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కీలక పాత్రలలో నటించారు..ప్రస్తుతం కూలీ సినిమాలో రజినీకాంత్ తో పాటు టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్, సౌబిన్ షబీర్, సత్యరాజ్ వంటి స్టార్స్ నటిస్తున్నారు…యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు..

ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేయాలని మేకర్స్ భావించారు…లోకేష్ కనగరాజ్ సైతం వేగంగా షూటింగ్ చేస్తున్నాడు. కానీ కూలీ సినిమా ఔట్ పుట్ దృష్ట్యా ఆ తేదిని రిలీజ్ చేయడం కష్టం అని తెలుస్తుంది.. అందుకే మే నుంచి కూలీ చిత్రాన్ని వాయిదా వేస్తున్నారని సమాచారం.. మళ్లీ కొత్త డేట్ ఆగస్ట్ లో ఉండొచ్చని తెలుస్తుంది

Related posts

కంగువ కి 24 ఏంటి సంబంధం అనుకుంటున్నారా ?

filmybowl

ఒళ్ళు దగ్గర పెట్టుకో తోలు తీస్తా అంటూ అల్లుఅర్జున్ కి ఏసీపి మాస్ వార్నింగ్..!!

murali

మెగాస్టార్ ” విశ్వంభర ” సమ్మర్ కైనా వచ్చేనా..?

murali

Leave a Comment