MOVIE NEWS

గేమ్ ఛేంజర్ : టికెట్ రేట్స్ పెంపుకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!!

ఇటీవల పుష్ప 2 సినిమాకు భారీగా టికెట్స్ రేట్స్ కి హైక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఆ సినిమాకు ఎంతగానో సపోర్ట్ చేసింది.. కానీ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది.. దీనితో ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఇక ఏ సినిమాకు తెలంగాణలో స్పెషల్ షోస్, టికెట్స్ రేట్స్ హైక్ ఉండదని ప్రకటించింది..

డాకు మహారాజ్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముహూర్తం ఫిక్స్..!!

అయితే ఈ ఇష్యూ పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖులు అంతా కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిసి సుధీర్గంగా చర్చించడం జరిగింది.. ఆ మీటింగ్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు సీఎం రేవంత్ రెడ్డిని టికెట్ రేట్స్ గురించి కన్విన్స్ చేసే ప్రయత్నం చేసారు.. కానీ ఆయన టికెట్ రేట్స్ పై అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని చెప్పారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ డ్రగ్స్ గురించి గాని అలాగే ప్రజలకు ఉపయోగపడే పని ఏదైనా ప్రభుత్వం తరుపున ప్రజలకు అవగాహన కలిపిస్తే ఇండస్ట్రీకి ప్రభుత్వం తరుపున ఎలాంటి సహాయం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు..

దీనికి వారంతా ఒప్పుకోవడంతో ఆ ఇష్యూ అంతటితో ముగిసింది.. కానీ గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ కి టికెట్ రేట్స్ పెంపు విషయంలో నిర్మాత దిల్ రాజు సీఎం రేవంత్ రెడ్డిని మరోసారి రిక్వెస్ట్ చేయడం జరిగింది.. ఈ సినిమా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ నేపథ్యంలో రేవంత్ గవర్నమెంట్ తెలంగాణ లో “గేమ్ ఛేంజర్ “ టికెట్ రేట్స్ పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది..తొలి రోజు ఉదయం 4 గంటల షో తో సహా 6 ఆటలకు అనుమతిని ఇచ్చింది..సింగిల్ స్క్రీన్స్ థియేటర్ లో రూ. 100..మల్టీప్లెక్స్ లో రూ. 150 చొప్పున పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది.. ఈ నెల 11 నుంచి 19 వ తేదీ వరకు ఐదు షోలకు అనుమతిని ఇస్తూ.. సింగిల్ స్క్రీన్ రూ. 50 మల్టీప్లెక్స్ రూ. 100 చొప్పున టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతిని ఇచ్చింది..

 

 

Related posts

పుష్ప 2 : మ్యూజిక్ కాంట్రవర్సీ..దేవిశ్రీ కామెంట్స్ పై స్పందించిన ప్రొడ్యూసర్..!!

murali

తన నెక్స్ట్ మూవీపై సూపర్ ట్విస్ట్ ఇచ్చిన సుకుమార్..?

murali

మెగాస్టార్ సినిమాపై నాగవంశీ షాకింగ్ కామెంట్స్.. ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్..!!

murali

Leave a Comment