MOVIE NEWS

గేమ్ ఛేంజర్ కి షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం..!!

గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ ఎట్టకేలకు థియేటర్లో రిలీజ్ అయింది.స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని సాలిడ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించారు. గ్రాండ్ గా రిలీజ్ అయిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు ప్రేక్షకుల నుండి ఊహించని రెస్పాన్స్ వస్తుంది… ఫస్డ్ డే గేమ్ ఛేంజర్ సినిమా భారీ వసూళ్లు సాధించినట్లు తెలుస్తుంది..ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ఏకంగా రూ. 186 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టుగా మేకర్స్ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ డే పోస్టర్స్ పరంగా చూస్తే గేమ్ ఛేంజర్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర హెయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన సినిమాల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది.

రాజమౌళి మూవీ కోసం మహేష్ స్పెషల్ ట్రైనింగ్..!!

ఛాన్నాలకు రాంచరణ్ నటించిన సోలో సినిమా కావడంతో గేమ్ ఛేంజర్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ ఇప్పటికే భారీగా బుక్కైన సంగతి తెలిసిందే. దీనిని బట్టే ఈ సినిమాపై ఎంత క్రేజ్ వుందో చెప్పొచ్చు..ఇది ఇలా ఉంటే గేమ్ ఛేంజర్ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. గేమ్‌ ఛేంజర్‌ సినిమా స్పెషల్‌ షోలను రద్దు చేసింది. ఈ మేరకు హోంశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో రేపటి నుంచి తెలంగాణాలో గేమ్ ఛేంజర్ మార్నింగ్‌ స్పెషల్‌ షోలు నిలిచిపోనున్నాయి. టికెట్‌ ధరల పెంపు, ప్రత్యేక ప్రదర్శనలపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా బెనిఫిట్‌ షోలను రద్దు చేసి స్పెషల్‌ షోలకు మాత్రం అనుమతి ఇవ్వడాన్ని కోర్టు తప్పుపట్టింది. దీనిపై పునరాలోచించాలని ప్రభుత్వాన్ని సూచించింది. దీంతో ప్రభుత్వం స్పెషల్‌ షోలను రద్దు చేసినట్లు సమాచారం

Related posts

డాకు మహారాజ్ : “దబిడి దిబిడి” సాంగ్ పై మాస్ ట్రోలింగ్.. ఇలాంటి స్టెప్స్ ఎందుకంటూ షాకింగ్ కామెంట్స్..!!

murali

ఆర్ఆర్ఆర్ : డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది… తెరవెనుక సీన్స్ అదిరిపోయాయిగా..!!

murali

పోటీ లో గెలిచిన అనిల్ రావిపూడి

filmybowl

Leave a Comment